అఖిల్ తో చేసిన ‘ఏజెంట్’ సురేందర్ రెడ్డికి గట్టి షాక్ ఇచ్చింది. ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీ విడుదలకు కూడా నోచుకోలేదు. ఆర్థికంగా చాలా పెద్ద డిజాస్టర్. అయితే ఆ వెంటనే తేరుకొని కొత్త కథలు రెడీ చేసుకొని, హీరోలని సెట్ చేసుకొనే పనిలో పడ్డాడు. వెంకటేష్‌కి ఓ కథ చెప్పాడు. అది ఆల్మోస్ట్ ఓకే అనుకొంటున్న తరుణంలో సడన్ బ్రేకులు పడ్డాయి. తమిళ హీరో విక్రమ్ కీ కథ చెప్పాడు. తన డేట్లు ఇప్పుడు అందుబాటులోకి లేకుండా పోయాయి. దాంతో బాలీవుడ్ వైపు గురి పెట్టాడు. రణ్వీర్ సింగ్ కి ఓ కథ చెప్పాలని సురేందర్ రెడ్డి గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. తను కూడా సూరికి అప్పాయింట్ మెంట్ ఇచ్చాడు. ఈ వారంలోనే వీరిద్దరి భేటీ ఉండబోతోంది. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో కథ సాగబోతోందని, ఈ సినిమాలో రణవీర్ పాత్ర చాలా వైల్డ్ గా ఉంటుందని టాక్. `యానిమల్` హిట్టయ్యాక.. బాలీవుడ్ హీరోలు సౌత్ దర్శకులపై మరింత నమ్మకాన్ని పెంచుకొన్నారు. సూరికి కూడా ఇది మంచి ఆఫరే. కథ సెట్ అయితే, సూరి తదుపరి హీరో.. రణవీర్ కావొచ్చు. మరో వారం ఆగితే… ఈ ప్రాజెక్ట్ గురించిన పూర్తి వివరాలు అందుతాయి.