ఏజెంట్ ఫ్లాప్‌తో సురేందర్ రెడ్డి పూర్తిగా డీలా పడిపోయాడు. ఇక సూరికి హీరోలు సినిమాలు ఇవ్వడం కష్టమే అనుకొన్నారంతా. కానీ.. ఒకేసారి రెండు ప్రాజెక్టులు సెట్ చేసుకొన్నాడు సూరి. ఓ వైపు వెంకటేష్‌కి ఓ కథ చెప్పి ఓకే చేయించుకొన్నాడు. మరోవైపు విక్రమ్ తో సినిమా చేసే ప్లాన్ చేస్తున్నాడు. ఇటీవల చియాన్ విక్రమ్ ని కలిసిన సూరి… ఓ కథ చెప్పి ఒప్పించాడు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే ముందుగా వెంకీ సినిమా మొదలవుతుందా? విక్రమ్ సినిమా స్టార్ట్ చేస్తారా? అనేది చిన్న డైలామా. విక్రమ్ పాత్రల కోసం ఎలా సన్నద్ధం అవుతాడో తెలియంది కాదు. తన కొత్త సినిమా `తంగళన్` కోసం మరీ బక్క చిక్కి పోయాడు. సురేందర్ రెడ్డి సినిమా కోసం తన రూపు రూఖల్ని మార్చుకోవాల్సివుంది. అందుకు కొంత సమయం పట్టొచ్చు. ఈలోగా… వెంకటేష్ సినిమాని పూర్తి చేస్తే ఓకే. లేదంటే.. విక్రమ్ రెడీ అయ్యేంత వరకూ ఆగాలి.