శింబు కథానాయకుడిగా వచ్చిన ‘మానాడు’ మంచి విజయం సాధించింది. వెంకట్ ప్రభు క్రేజీ టైం లూప్ కాన్సెప్ట్ థ్రిల్ చేసింది. నిర్మాత సురేష్ బాబు ఈ సినిమా రిమేక్ హక్కులని తీసుకున్నారు. హరీష్ శంకర్, దశరథ్ తెలుగు స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నారు. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరిగింది. అయితే అది వాస్తవం కాదు. హరీష్ శంకర్, దశరథ్ కాకుండా వేరే దర్శకుడితో ఈ సినిమా పట్టాలెక్కనుంది.
అలాగే కథానాయకుడి విషయంలో కూడా ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదు. రవితేజ, సిద్దు జొన్నల గడ్డ పేర్లు వినిపించాయి. అయితే సురేష్ బాబు మాత్రం ఈ కథ రానాతో బావుటుందనే ఆలోచనలో వున్నారు. రానా సోలో హీరోగా సినిమా వచ్చి చాలా కాలం అయింది. వైవిధ్యమైన టైం లూప్ కాన్సెప్ట్ రానాకి బావుంటుందని సురేష్ బాబు ఆలోచన. అలాగే విలన్ గా చేసిన ఎస్ జే సూర్య పాత్ర కోసం కూడా అన్వేషణ జరుగుతుంది. కుదిరితే ఎస్ జే సూర్యతోనే చేయాలనే ఆలోచన కూడా వుంది. త్వరలోనే ఈ సినిమాపై ఒక అధికారిక ప్రకటన చేస్తారు.