రవిబాబు ఇప్పుడు పూర్తిగా సురేష్ ప్రొడక్షన్ కాంపౌండ్ లోకి వ్యక్తి. ఆ బ్యానర్లోనే ఎక్కువ సినిమాలు చేశాడు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. తక్కువ పెట్టుబడి – క్వాలిటీ మేకింగ్ – అంటూ రవిబాబు ఎంచుకున్న ఫార్ములాకి సురేష్‌బాబు ఎప్పుడో ఫ్లాట్. అందుకే ఇద్దరి కాంబోలో విరివిగా సినిమాలొస్తుంటాయి. తాజాగా.. రవిబాబుపై మరోసారి నమ్మకం ఉంచాడు సురేష్‌బాబు. తన రెండో కుమారుడు అభిరామ్ ని హీరోగా చేసే బాధ్యత రవిబాబుపై పెట్టాడు.
అభిరామ్ హీరో ఎంట్రీపై రెండు మూడేళ్లుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. సురేష్‌బాబు కూడా చాలా కథలు విన్నాడు. చాలామంది దర్శకులతో ట్రావెల్ చేశాడు. కానీ..ఎవ్వరిపై నమ్మకం ఉంచలేకపోయాడు. చివరికి.. రవిబాబునే నమ్మాడు. ఇప్పుడు సురేష్ ప్రొడక్షన్ లో రవిబాబు దర్శకత్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోనుందని, ఈ సినిమాతో అభి హీరోగా ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. కథ సిద్ధమైంది. ప్రస్తుతం.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.