మాజీ సీఎం కేసీఆర్ బాత్రూంలో జారిపడటంతో తుంటి విరిగిందని వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. హిప్ రీప్లేస్ మెంట్ సర్జరీని.. ప్రముఖ అర్థోపెడిక్ డాక్టర్ కూడా అయిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ చేస్తారు. సర్డరీ తర్వాత కేసీఆర్ కేసీఆర్ రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటారు. కేసీఆర్ క్షేమంగా ఉండాలని సోషల్ మీడియాలో మోదీతో పాటు చంద్రబాబు, లోకేష్, పవన్ కోరారు. పలువురు తెలంగాణ నేతలు ఆస్పత్రికి వెళ్లి హరీష్ రావుతో మాట్లాడారు. అయితే హరీష్ రావు ఆస్పత్రికి ఎవరూ రావొద్దని కోరారు.
పార్టీ నేతలు, కార్యకర్తలు ఎవరూ రావొద్దన్నారు. కేసీఆర్ రెండు నెలల పాటు రాజకీయ కార్కక్రమాలకు దూరం అవుతారు. శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయాల్సి ఉంది. అది కూడా సాధ్యం కాదు. కోలుకున్న తర్వాత ఆయన ప్రమాణం చేసే అవకాశం ఉంది. రెండు, మూడు నెలల పాటు ఆయన బెడ్ రెస్ట్ మీద ఉండాల్సి రావడంతో.. ఇంటి దగ్గరే ప్రమాణం చేసే అవకాశం ఉంటే.. ప్రమాణం చేసే అవకాశం ఉంది. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే అవకాశం లేనందున బీఆర్ఎస్ఎల్పీ లీడర్ గా కేటీఆర్ లేదా హరీష్ రావుల్లో ఒకర్ని ఎంపిక చేసే అవకాశం ఉంది.
ఇప్పుడు ఎదురు దెబ్బ తగిలినా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను మళ్లీ పుంజుకునేలా చేయడానికి కేసీఆర్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. జిల్లాలు పర్యటించాలనుకున్నారు. కానీ లోక్ సభ ఎన్నికల సన్నాహాలు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇక లోక్ సభ ఎన్నికల బాధ్యత కూడా కేటీఆర్, హరీష్ రావుల మీదనే పడే అవకాశం ఉంది.