పుల్వామా ఉగ్రదాడి తర్వాత… ఉగ్రవాదులను టార్గెట్ చేసుకుని ఏదో ఒకటి చేయాలన్న డిమాండ్ నేపధ్యంలో.. ఆర్మీ… సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రస్థావరాలపై అర్ధరాత్రి మెరుపుదాడులు చేసింది. 12 మిరేజ్ 2000 ఫైటర్ జెట్లతో సుమారు వెయ్యి కిలోల బాంబులను జైషే మహ్మద్ తీవ్రవాద స్థావరాలపై వేసింది. తెల్లవారుజామున ఈ దాడి చేసినట్లుగా.. కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. పీవోకేలో ఉన్న అతిపెద్ద జైషే ఉగ్ర శిబిరం పూర్తిగా ధ్వంసం అయిందని ప్రచారం జరుగుతోంది. బాలాకోట్, చకోటి, ముజఫరబాద్లోని 3 ఉగ్రశిబిరాలు నామరూపాల్లేకుండా పోయాయని అంటున్నారు. ఈ శిబిరాల్లో ఉంటున్న 200 మంది చనిపోయి ఉండవచ్చని చెబుతున్నారు.
భారత వాయుసేన జరిపిన ప్రతీకార దాడిపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహిస్తున్నారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తదితర ముఖ్యులతో సమావేశం అయ్యారు. ఉగ్రవాదులపై ప్రతీకారదాడిలో పాల్గొన్న ఐఏఎఫ్ పైలెట్లకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సెల్యూట్ చేశారు. భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన విషయాన్ని పాక్ సైన్యం కూడా ధ్రువీకరించింది. అంతేకాక పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ .. భారత వైమానిక దళం తమ భూభాగంలోకి వచ్చి దాడులు జరిపినట్లు ఆయన అంగీకరించారు. కానీ భారత విమానాలను పాక్ వైమానిక దళం తిప్పికొట్టిందన్నారు. భారత్ చేసిన సర్జికల్ స్టైక్స్లో ఎలాంటి నష్టం జరగలేదని పాక్ ఐఎస్పీఆర్ డీజీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్విట్టర్లో ప్రకటించారు.
పుల్వామా దాడి తర్వతా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై… దాడులు చేయాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా వచ్చింది. దీనికి తగ్గట్లుగానే.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ… ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. అఖిలపక్షం ఏ… చర్య తీసుకున్నా.. మద్దతుగా ఉంటామని చెప్పడంతో.. దానికి అనుగుణంగా.. ఆర్మీ సర్జికల్ స్ట్రైక్స్‌ను చేసింది. గతంలో.. యూరీ ఘటనకు ప్రతీకారంగా.. సర్జికల్ స్ట్రైక్స్ వన్ జరిపారు. అప్పుడుకూడా.. ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారు. అప్పట్లోనే ఇక.. ఉగ్రవాదులు అంతమయ్యారని అనుకున్నారు కానీ…మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేయాల్సి వచ్చింది.