తమిళ హీరో సూర్య… ఇప్పుడు తెలుగు పై దృష్టి పెట్టాడు. సూర్య నేరుగా ఓ తెలుగు సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. కానీ అది కుదరడం లేదు. అయితే ఈసారి.. నిర్మాతగా తెలుగులో సినిమాలు చేయాలని గట్టిగా ఫిక్సయ్యాడట. సూర్యకి ఓ నిర్మాణ సంస్థ ఉంది. జ్యోతిక కోసం కొన్ని సినిమాల్ని తమిళంలో నిర్మించాడు. తెలుగులోనూ.. కొన్ని చిన్న సినిమాల్ని తన బ్యానర్ లో చేయాలనుకుంటున్నాడు సూర్య. ఈ సినిమాల్లో సూర్య నటించడట. అందులోనూ కేవలం తెలుగులోనే విడుదల అవుతాయట. అందుకోసం కొన్ని కథల్ని వింటున్నాడు సూర్య. తెలుగులో తీయబోయే సినిమాల కోసం టాలీవుడ్ లో ఓ పార్టనర్ ని కూడా వెదికి పెట్టుకున్నాడని తెలుస్తోంది. ఓ అగ్ర నిర్మాణ సంస్థతో కలిసి… ఆయా సినిమాల్ని సూర్య నిర్మించబోతున్నట్టు టాక్. ఆ అగ్ర నిర్మాణ సంస్థ ఏది? సూర్య నిర్మించే సినిమాల్లో హీరోలెవరు? అనే విషయాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.