ఎప్పటికప్పుడు జోనర్స్ మార్చడంలో సూర్య రూటే వేరు. రెండు యాక్షన్ సినిమాల తర్వాత జోనర్ షిఫ్ట్ ఆయనకి అలవాటే. ప్రస్తుతం శివ దర్శకత్వంలో ‘కంగువ’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇదొక ఫాంటసీ యాక్షన్ మూవీ. దీని తర్వాత కార్తిక్ సుబ్బరాజ్ తో చేస్తున్న సినిమా గ్యాంగ్ స్టర్ యాక్షన్. ఈ రెండు సినిమాల తర్వాత సూర్య ఓ కామెడీ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చారు. ఆయనే ఆర్జే బాలాజీ.
రేడియో జాకీగా పాపులరైన బాలాజీకి చాలా రంగాల్లో ప్రవేశం వుంది. యాక్టర్, రైటర్, డైరెక్టర్ ఇలా అన్నిట్లో ఆల్ రౌండర్ ఆయన. ఇప్పుడు సూర్యతో సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. డ్రీమ్ వారియర్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. మ్యూజిక్ కోసం రెహ్మాన్ ని తీసుకున్నారు. అడ్వెంచర్ యాక్షన్ జోనర్ లో ఈ సినిమా ఉండబోతోంది. మూకుతి అమ్మన్, వీట్ల విశేషం లాంటి కామెడీ టచ్ వున్న సినిమాలని తీసిన బాలాజీకి సూర్య అవకాశం ఇవ్వడం విశేషమే.