ప్రస్తుతం ‘కంగువ’ సినిమాతో బిజీగా ఉన్నాడు సూర్య. అతని చేతికి మరో క్రేజీ ప్రాజెక్ట్ వెళ్లింది. రంగ్ దే బసంతి, ఢిల్లీ 6, భాగ్ మిల్కా భాగ్ లాంటి మర్చిపోలేని సినిమాల్ని అందించిన ఓం ప్రకాశ్ మెహ్రా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. దీనికి `కర్ణ` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఎక్స్.ఎల్.మీడియా పతాకంపై పర్హాన్ అక్తర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
మహా భారతంలో కర్ణుడి పాత్రకు విశిష్టమైన స్థానం ఉంది. అతన్నే కథానాయకుడిగా చేసుకొని చాలా సినిమాలొచ్చాయి. అయితే బాలీవుడ్ లో అలాంటి ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు తొలిసారి ‘కర్ణ’ బాలీవుడ్ కి వెళ్లబోతోంది. అన్ని భాషల నుంచి.. ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్టులో భాగం పంచుకోబోతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. బడ్జెట్ దాదాపుగా రూ.600 కోట్లని సమాచారం అందుతోంది. సూర్య కెరీర్లో అత్యంత భారీ వ్యయంతో నిర్మించే చిత్రం ఇదే. ఈ డిసెంబరు నుంచి షూటింగ్ ప్రారంభించనున్నారని సమాచా