తమిళ స్టార్ విజయ్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్న సంగతి తెలిసిందే. విజయ్ తెలుగులో నేరుగా చేస్తున్న తొలి సినిమా ఇది. నిజానికి.. తమిళ హీరోలు చాలామంది తెలుగులో సినిమా చేయాలని చూశారు. అందులో సూర్య ఒకడు. కథలు కుదరకపోవడం వల్ల సూర్య ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ఇప్పుడు బోయపాటి శ్రీను.. సూర్య కోసం ఓ కథ సిద్ధం చేశాడని తెలుస్తోంది.
ప్రస్తుతం బాలకృష్ణతో `అఖండ` తెరకెక్కిస్తున్నాడు బోయపాటి. లాక్ డౌన్ సమయంలో మరి కొన్ని కథలూ సిద్ధం చేశాడు. అందులో ఓ కథని బన్నీ కోసం పక్కన పెట్టాడు. మరో కథ సూర్య కోసం రాసుకున్నదని తెలుస్తోంది. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నట్టు టాక్. విజయ్ తెలుగు సినిమాకీ.. దిల్ రాజునే నిర్మాత. ఇప్పుడు సూర్యని దిల్ రాజునే తెలుగులోకి తీసుకొస్తున్నారు. `అఖండ` తరవాత… బన్నీతో సినిమా చేయాలన్నది బోయపాటి ప్లాన్. అది కాస్త అటూ ఇటూ అయితే.. సూర్యని ఆప్షన్ గా ఉంచుకున్నాడు. బన్నీ సినిమా ఓకే అయితే, ఆ తరవాత సూర్య సినిమా పట్టాలెక్కుతుంది.