కార్తికేయ 2తో ఓ సూపర్ హిట్టు కొట్టాడు చందూ మొండేటి. ఆ తరవాత.. చందూకి భారీ ఆఫర్లు వచ్చాయి. కార్తికేయ 3 కోసం కసరత్తులు చేస్తున్నాడు. ఈలోగా.. గీతా ఆర్ట్స్ లో సినిమా చేయడానికి సంతకాలు చేశాడు. గీతా – చందూ కాంబో సెట్టయ్యింది.కానీ హీరోనే దొరకడం లేదు. ఎట్టకేలకు చందూ ఓ హీరోకి కథ చెప్పి, ఒప్పించినట్టు టాక్. ఆ హీరో ఎవరో కాదు.. సూర్య.
తెలుగులో ఓ స్ట్రయిట్ సినిమా చేయాలని సూర్య ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ తో కూడా ఓ సినిమా చేయాలన్నది సూర్య ఆలోచన. ఎందుకంటే.. సూర్య `గజిని`ని తెలుగులో విడుదల చేసింది గీతా ఆర్ట్స్‌నే. ఆ సినిమా పెద్ద విజయాన్ని అందుకోవడమే కాకుండా.. సూర్యకు తెలుగులో ఓ మార్కెట్ ని సెట్ చేసింది. అప్పటి నుంచీ గీతా ఆర్ట్స్‌లో ఓ స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తానని చెబుతూనే వస్తున్నాడు. అప్పటి ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇలా చందూతో సెట్టయ్యిందన్నమాట. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాని పట్టాలెక్కిస్తారు. త్వరలోనే ఈ కాంబోకి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.