సంక్రాంతి బ‌రిలో మరో సినిమా

2025 సంక్రాంతికి ఇంకా చాలా స‌మ‌యం ఉంది. అయితే… బెర్తులు మాత్రం ఫుల్ అయిపోతున్నాయి. 2025 సంక్రాంతికి వ‌చ్చేస్తామంటూ నిర్మాత‌లు ముంద‌స్తుగానే ప్ర‌క‌టించేస్తున్నారు. ఇప్ప‌టికే ‘విశ్వంభ‌ర‌’ సినిమా సంక్రాంతికి ఫిక్స‌య్యింది. నాగ‌చైత‌న్య ‘తండేల్‌’ కూడా సంక్రాంతినే టార్గెట్ చేసుకొంది. వెంక‌టేష్ – అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకొంటోంది. ఈ సినిమానీ పండక్కే విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో మ‌రో సినిమా చేరింది.

సూర్య ప్ర‌స్తుతం ‘కంగువ‌’ అనే సినిమా చేస్తున్నాడు. శివ ద‌ర్శ‌కుడు. ఆ త‌ర‌వాత కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి ఒప్పుకొన్నాడు. ఈరోజే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చేసింది. ఈరోజు సూర్య పుట్టిన రోజు సంద‌ర్భంగా చిత్ర‌బృందం ప్ర‌త్యేక‌మైన గ్లింప్స్ విడుద‌ల చేసింది. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు చిత్ర‌బృందం స్ప‌ష్టం చేసింది. సో… ఈ ముగ్గుల పండ‌క్కి సూర్య సినిమా కూడా రాబోతోంద‌న్న‌మాట‌.

Also Read: మొస‌లితో హీరో ఫైటింగ్‌!

గ్యాంగ్‌స్ట‌ర్‌కి సంబంధించిన క‌థ ఇది. సూర్య క్యారెక్ట‌రైజేష‌న్ కొత్త‌గా ఉండ‌బోతోంద‌ని టీమ్ చెబుతోంది. నిజానికి సుధా కొంగ‌ర దర్శ‌క‌త్వంలో సూర్య ఓ సినిమా చేయాలి. స్క్రిప్టు కూడా సిద్ధ‌మైంది. అయితే కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల ఈ ప్రాజెక్ట్ నుంచి సూర్య త‌ప్పుకొన్నాడు. అత‌ని ప్లేస్‌లోకి శివ కార్తికేయ‌న్ చేరాడు. ఆ సినిమా స్థానంలోనే కార్తీక్ సుబ్బ‌రాజు చిత్రాన్ని ప‌ట్టాలెక్కించాడు సూర్య‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close