మంత్రుల సిబ్బంది వ్యవహారం శృతి మించుతోందని నివేదికలు వస్తూండటంతో ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటోంది. మంత్రులు నియమించుకున్న సిబ్బంది వారి బ్యాక్ గ్రౌండ్ పై పూర్తి సమాచారాన్ని సేకరిస్తోంది. ముఖ్యంగా మంత్రుల తరపున వ్యవహారాలు చక్కబెట్టేవారి గురించి పూర్తి వివరాలు ఆరా తీస్తోంది. వారి పని తీరు వల్ల మంత్రుల ఇమేజ్ దెబ్బతింటోంది. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ఈ సారి అలాంటి పరిస్థితుల్ని రానివ్వకూడదని నిర్ణయించారు.
ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేషీలోని అదికారులపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. వారిలో చాలా మంది వైసీపీ హయాంలో ఉన్న వారే . ఇప్పటి కొనసాగుతున్నారు. మార్చుకోకపోవడం.. తెలిసిన వారు అని పాత వారినే కొనసాగించడంతో వారు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఏకంగా మంత్రి ఇంటి దగ్గరే పనులు చక్కబెడుతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఇప్పటికే ఇంటలిజెన్స్ నివేదికలు రెడీ చేసినట్లుగా తెలుస్తోంది.
ఇతర మంత్రుల సిబ్బంది కూడా చాలా మంది వైసీపీ హయాంలో ఉన్న వారే ఉన్నట్లుగా ఫిర్యాదులు వస్తూండటంతో దీనిపై జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించారు. పూర్తి స్థాయి సమాచారం సీఈవోకు చేరుస్తున్నారు. మంత్రుల సిబ్బంది వల్లే చాలా సార్లు మంత్రులు టెన్షన్లు పడుతున్నారు. వ్యతిరేకత పెంచుకుంటున్నారు. ఈసారి అలాంటి పరిస్థితిని వీలైనంతగా తగ్గించాలని ప్రభుత్వం భావిస్తోంది.