2019 సాధారణ ఎన్నికలని దృష్టిలో ఉంచుకుని రిపబ్లికన్ టీవీ, సి ఓటర్ ఒక సర్వే చేసింది. ప్రధానంగా పార్లమెంటు స్థానాల గురించి చేసిన ఈ సర్వే 2019 లో మళ్ళీ ఎన్డీయే అధికారం లోకి వస్తుందని అంచనా వేసింది. ఇక ఎపి లో వైసిపి కి, తలంగాణా లో టీఆరెస్ కి, తమిళ నాట రజనీ కి ఆధిక్యం ఉన్నట్టు చెప్పిది సర్వే.
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కేంద్రంలో బిజెపి ఆద్వర్యంలోని ఎన్.డి.ఎ.కూటమికి 335 సీట్ల వరకు రావచ్చని, యుపిఎ కి 89 స్థానాలు రావచ్చని సర్వే అంచనా వేసింది. ఎపిలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు 13, టిడిపి,బిజెపి కూటమికి 12 సీట్లు దక్కవచ్చని అంచనా వేసింది. తెలంగాణలో టిఆర్ఎస్ కు 11, బిజెపికి 3, కాంగ్రెస్ కు 2, ఎమ్.ఐ.ఎమ్. 1 సీటు రావచ్చని సర్వే అంచనా వేసింది రిపబ్లికన్, సి ఓటర్ సర్వేలో తమిళనాడులో లోక్ సభ ఎన్నికలు జరిగితే రజనీకాంత్ పార్టీకి 23 స్థానాలు రావచ్చని, డి.ఎమ్.కె.కి 14 సీట్లు రావచ్చని అంచనా వేశారు.అన్నా డి.ఎమ్.కె.కేవలం 2 సీట్లే వస్తాయని సర్వే అబిప్రాయపడింది.రజనీకాంత్ పోటీలో లేకపోతే డి.ఎమ్.కె.కి 32 సీట్లు, అన్నా డి.ఎమ్.కె. 6 సీట్లు, బిజెపి 1 సీటు రావచ్చని సర్వే అంచనా వేసింది.
రోజు రోజుకీ డైనమిక్ గా మారడం ప్రస్తుత పాలిటిక్స్ లో చూస్తూనే ఉన్నాం. ఎన్నికలకి మూణ్ణెల్ల ముందు చేసిన సర్వేలు కూడా ఆ తర్వాతి పరిణామాల్లో మారిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి సర్వే లు రాబోయే ఏడాది లో మరిన్ని రావడం, అందులో విభిన్నమైన ఫలితాలు రావడమూ ఖాయం.