ఎన్నికలు ముంచుకొచ్చిన సమయంలో సర్వేల పేరుతో రాజకీయ పార్టీలు విన్యాసాలు చేస్తూ ఉంటాయి. ఈ సర్వేల పేరుతో ఇన్ ఫ్లూయన్సర్లను ఆకట్టుకుని భారీగా డబ్బులు వెదజల్లడానికి కొంతమంది రెడీ గా ఉంటారు. వైసీపీ చివరికి జాతీయ మీడియా చానళ్లకూ కోట్లకు కోట్లు ప్రజాధనాన్ని వెళ్లగొడుతుంది.అయితే ఈ సర్వేలు ఫలితాల్ని మార్చలేవని ఎప్పుడో తెలిపోయింది.
ఏపీలో అతి పెద్ద సర్వే ఫలితాలతో సహా ఎప్పుడో వెల్లడయింది. ప్రజాభిప్రాయం పూర్తి స్థాయిలో వెలువడేలా.. మూడు గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఓటు హక్కు వినియోగింంచున్న వారిలో నిరుపేదలు దగ్గర నుంచి జగన్ రెడ్డి వచ్చాక ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ఉద్యోగుల వరకూ అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన వారిలో అన్ని కులాల ఓటర్లు ఉన్నారు. అన్ని వర్గాల వారు ఉన్నారు. రాష్ట్రం నలుమూలల ప్రజలందరి అభిప్రాయం స్పష్టమైంది. ఇంత భారీ సర్వేను ఏ సంస్థ కూడా చేపట్టలేదు. ఫలితం కూడా చాలా క్లియర్ గా వచ్చింది.
సజ్జల రామకృష్ణారెడ్డి తమ ఓటర్లు వేరు అని జగన్ రెడ్డిని మోసం చేశారేమో కానీ.. . ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చలేరు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు మరింతగా పరిస్థితి దిగజారిపోయింది.ఇంత జరుగుతున్నా సర్వేల పేరుతో సొంత పార్టీ నేతల్ని మభ్య పెట్టేందుకు జగన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఉత్తరాది వాళ్లకు డబ్బులిచ్చి లేనిపోని రిపోర్టులు రాయించుకుంటున్నారు. కానీ నిజమేంటో ఆయన పార్టీ నేతలకు అర్థమైంది. పెద్ద ఎత్తున పార్టీ మారిపోతున్నారు. జగన్ రెడ్డికి కూడా తెలుసని మేకపోతు గాంభీర్యమన్న సెటైర్లు వారు వేస్తున్నారు.