అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’. మే మొదటి వారంలో విడుదలకు సిద్ధమైంది. భరత్ అనే నేను పబ్లిసిటీ హడావుడి తగ్గాక.. సూర్య ప్రమోషన్లు మొదలవుతాయి. ఈలోగా ఒక్కో పాటనీ విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఈనెల 29న ప్రీ రిలీప్ ఫంక్షన్ చేయాలన్నది చిత్రబృందం నిర్ణయం. గచ్చి బౌలి స్టేడియంలో ఫంక్షన్ చేద్దామంటే.. అది ఖాళీ లేదని తేలింది. అందుకే 29న మరోచోట ఫంక్షన్ చేయాలా? లేదంటే గచ్చిబౌలి స్టేడియం కోసం డేటు మర్చాలా? అనే విషయంలో చిత్రబృందం తర్జన భర్జనలు పడుతోంది. ఆడియో ఎప్పుడు, ఎక్కడ? అనే విషయంపై ఈరోజు సాయంత్రానికల్లా ఓ క్లారిటీ రావొచ్చు. చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తారని టాక్. చిరుతో పాటు తమిళ నటుడు సూర్యని కూడా ఆహ్వానించే అవకాశాలు కనిపిస్తున్నాయి.