రాహుల్ విజయ్, నిహారిక కొణిదెల జంటగా నటిస్తున్న సినిమా ‘సూర్యకాంతం’. నిహారిక ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘ముద్దపప్పు ఆవకాయ్’కి దర్శకత్వం వహించిన ప్రణీత్ ఈ చిత్రానికి దర్శకుడు. నిన్న టీజర్ విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే.. వెబ్ సిరీస్‌లో నిహారికను అల్లరి పిల్లగా, మోడర్రన్ అమ్మాయిగా చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు, మరోసారి అదే మేజిక్ రిపీట్ చేసేట్టు వున్నాడు.
టీజర్ ఇన్‌స్టంట్‌గా యూత్‌ని అట్రాక్ట్ చేయడానికి అందులో వినిపించిన సంగీతమూ ఓ రీజనే. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ వుంది. ఈ చిత్రానికి మార్క్ కె. రాబిన్ సంగీత దర్శకుడు. టీజర్లో వినిపించిన సంగీతం మొత్తం అతనిది కాదు. ముఖ్యంగా టీజర్లో వినిపించిన ట్యూన్ మార్క్ కె. రాబిన్ ట్యూన్ చేసినది కాదు. ‘నిన్ను కోరి’, ‘గీత గోవిందం’ చిత్రాల సంగీత దర్శకుడు గోపీసుందర్ది.
ఓ మలయాళ చిత్రం కోసం గోపిసుందర్ స్వరపరిచినదట. అతడి అనుమతి తీసుకుని ‘సూర్యకాంతం’ చిత్రబృందం ట్యూన్ ఉపయోగించుకుంది. అంతే కాదు… గోపిసుందర్ కి క్రెడిట్స్ కూడా ఇచ్చారు. తమకు నచ్చిన సన్నివేశాలు లేదా సంగీతాన్ని యథేచ్ఛగా కాపీ చేసే దర్శకులు, సంగీత దర్శకులు కొందరు. ‘సూర్యకాంతం’ చిత్రబృందం చేసినట్టు క్రెడిట్స్ ఇచ్చేవారు మరికొందరు.