ప్రభుత్వంపై పోరాడుతున్న ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ చాలా రోజులుగా ఆజ్ఞాతంలో ఉన్నారు. ఆయన ఆచూకీ పోలీసులకు తెలియదా.. తెలిసినా ముందస్తు బెయిల్ పై ఆయన పెట్టుకున్న పిటిషన్ కోసం వేచి చూస్తున్నారా అన్నది తెలియదు కానీ.. ఇప్పుడు ఆయన దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. దీంతో ఆయన అరెస్టే మిగిలింది.
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి సూర్యనారాయణ గండి కొడుతున్నారని ఆరోపిస్తూ సూర్యనారాయణపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే నలుగుర్ని అరెస్ట్ చేశారు. ఏ -5గా సూర్యనారాయణను చేర్చారు. అరెస్ట్ కాకుండా సూర్యనారాయణే మిగిలారు. గతంలో ప్రభుత్వంపై గవర్నర్క ఫిర్యాదు చేశారు సూర్యనారాయణ. ఆయన వాణిజ్య పన్నుల శాఖలో పని చేస్తూండటంతో అందులో ఉన్న లోపాలను వెలుగులోకి తెచ్చారు. ఈ కేసును ప్రభుత్వంలోని ఉన్నతస్థాయి నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారని చెబుతున్నారు. ఉద్యోగులకు ఆఫీసు బేరర్ లేఖలు, నకిలీ ధృవపత్రాలు జారీ ఆరోపణలపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇప్పటికి ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణకు ఒక్క చాన్స్ ఉంది. అదేమిటంటే లొంగిపోవడం. పోలీసులకు కాదు.. ప్రభుత్వానికి. సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఇతర సంఘాల నేతల్లా భజన చేస్తామని సంకేతాలు పంపితే పోలీసులు వదిలేస్తారు. లేకోపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారు. దీన్ని తప్పించుకోవడానికి ఆయన ఇప్పుడేం చేస్తారన్నది కీలకం.