ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబైలోని తన నివాసంలో ఈరోజు ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. ‘ఎం.ఎస్.ధోనిః ద అన్‌టోల్డ్ స్టోరీ’, `త్రీ ఈడియట్స్`, ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘పీకే’, ‘డిటెక్టీవ్ బొమ్‌కేష్ బక్షి’, ‘రాబ్టా’, ‘వెల్కమ్ న్యూయార్క్’, ‘కేదార్నాథ్’, ‘సోంచారియా’, ‘చిచ్చోర్’, ‘డ్రైవ్’ తదితర చిత్రాలలో ఆయన నటన ఆకట్టుకుంది. యువ హీరోల బ్యాచ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ … ఇలా సడన్‌గా ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. ఆయన ఆత్మహత్యకు గల కారణాలేవీ ఇప్పటి వరకూ బయటకు రాలేదు. సుశాంత్‌సింగ్ మృతి పట్ల బాలీవుడ్ ప్రముఖులు షాక్‌లో ఉన్నారు.