మెగాస్టార్ కుటుంబానికి త్వరలో వారసుడో వారసురాలో రాబోతున్నారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లితండ్రులుగా ప్రమోషన్స్ పొందబోతున్నారు. ఇది మా కుటుంబంలో అతి పెద్ద పండగ అంటున్నారు మెగా డాటర్ సుస్మిత. వాల్తేరు వీరయ్య సినిమాకి ఆమె కాస్ట్యుమ్ డిజైనర్ గా పని చేశారు. తాజాగా మీడియాతో ముచ్చటించారు.
మా ఇంట్లో పెద్ద పండగ రాబోతుంది. చరణ్ తండ్రి కాబోతున్నాడు. పాప బాబు ఎవరు పుట్టిన ఆనందమే. అయితే ఇప్పటికే నలుగురు ఆడపిల్లలు అయ్యారు. చరణ్ కి బాబు పుడితే బావుంటుందని నా కోరిక” అని తన మనసులో మాట బయటపెట్టారు సుస్మిత. ఇక వాల్తేరు వీరయ్య గురించి మాట్లాడుతూ.. బాబీ గారు మాకు వింటేజ్ చిరంజీవి లుక్ కావాలని చెప్పారు. నాన్నగారి సినిమాలన్నీ మాకు తెలుసు. ఎన్నోసార్లు చూశాం. దీంతో ఆయనకి కాస్ట్యుమ్ డిజైన్ చేయడానికి పెద్దగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం రాలేదు. తెరపై నాన్నని చూస్తుంటే ఒక పండగలా వుంది” అన్నారు.