బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విచ్చలవిడిగా ప్రైవేటు వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ పాల్పడిన మాఫియాలో భాగమైన వారు పరారైనట్లుగా తెలుస్తోంది. ట్యాపింగ్ కోసం ఓ సర్వర్ ను ఏకంగా ఐ న్యూస్ చానల్ కార్యాలయంలో పెట్టారు. ఆ చానల్ ఎండీ పరారరయ్యారు. ఆయన లండన్ లో ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కస్టడీలో శ్రవణ్ రావుతో కలిసి చేసిన ట్యాపింగ్‌ల గురించి వాటితో చేసిన దందాల గురించి ప్రణీత్ రావు చెప్పడంతో.. ఐ న్యూస్ తో పాటు..శ్రవణ్ రావు ఇంట్లోనూ సోదాలు చేశారు పోలీసులు.
ఐ న్యూస్ ఆఫీసులో ఒక ప్రత్యేక సర్వర్ రూమ్ ఏర్పాటు చేసి వ్యాపారవేతలు, రాజకీయ నాయకుల ఫోన్ టాపింగ్ కు పాల్పడ్డట్టు ప్రణీత్ రావు తేల్చారు. ఈ కేసులో తన పేరు ఉందని తెలుసకుున్న శ్రవణ్ రావు ముందుగానే లండన్ పారిపోయిటన్లుగా తెలుస్తోంది. మరో వైపు బీఆర్ఎస్ ఉన్నంత వరకూ ఐంటలిజెన్స్ ఐజీగా ఉన్న ప్రభాకర్ రావు కూడా స్పందించడం లేదు. ఆయన అమెరికా పారిపోయారని అనుమానిస్తున్నారు.
ట్యాపింగ్ కేసు అత్యంత తీవ్రమైనది కావడంతో… పోలీసులు అదుపులోకి తీసుకుంటారన్న అనుమానంతో వారు పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. వారిని ప్రశ్నిస్తే అదనపు వివరాలు తెలియవచ్చు కానీ.. టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయని… త్వరలో అరెస్టులు ఉంటాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. సిట్ దూకుడుగా కేసును కొలిక్కి తీసుకు రానుంది. ఇప్పటికే సంధ్యా రాజు అనే వ్యాపారవేత్త తన ఫోన్ ట్యాపింగ్‌లపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.