ఏపీలో విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన స్థానానికి రాజ్యసభసభ్యుడిగా బీజేపీకి చెందిన వారికే అవకాశం లభించనుంది. ఇప్పటికే కనీస బలం లేకపోయినా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు చివరికి నామినేటెడ్ పోస్టుల్లోనూ వాటా పొందుతున్న బీజేపీ.. రాజ్యసభ సీట్లను కూడా వదిలి పెట్టడం లేదు. ఇప్పటికే ఆర్.కృష్ణయ్యతో రాజీనామా చేయించి ఆయనను మళ్లీ రాజ్యసభకు పంపించారు. ఎమ్మెల్సీగా సోము వీర్రాజుకు అవకాశం ఇప్పించారు. ఇప్పుడు మరో రాజ్యసభ స్థానానికి రెడీ అయ్యారు. రాజ్యసభలో బలం తమకు అవసరం కాబట్టి తమకే కేటాయంచాలని బీజేపీ పెద్దలు చంద్రబాబును అడిగారని..దానికి ఆయన ఓకే అన్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
నిజానికి జనసేన పార్టీ తరపున నాగబాబు.. రాజ్యసభకు వెళ్లాలనుకున్నారు. సోదరుడు డిప్యూటీ సీఎంగా ఉంటే ఢిల్లీలో నాగబాబు పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయవచ్చని అనుకున్నారు. పైగా నాగబాబు అనకాపల్లి ఎంపీ టిక్కెట్ ను బీజేపీ కోసం త్యాగం చేశారు. అయితే బీజేపీ మాత్రం రాజ్యసభ విషయంలో తగ్గలేదు. దాంతో నాగబాబు ఎమ్మెల్సీగా సరి పెట్టుకోవాల్సి వచ్చింది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానం కోసం హైకమాండ్ మదిలో బీజేపీ అభ్యర్థి రెడీగా ఉన్నారు. ఆ అభ్యర్థి ఎవరో మాత్రం బయటకు రాలేదు.