కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు.. మాకే మీ వద్దు విభజన హామీల అమలుకు నిధులు కేటాయించండి చాలు అని అదే పనిగా మొర పెట్టుకుంటున్నాయి. కానీ మోడీ ప్రభుత్వ హయాంలో బడ్జెట్లను చూస్తే.. అవడానికి అది కేంద్ర బడ్జెట్ అవుతుంది కానీ… వాస్తంగా అయితే ఎన్నికలుజరిగే రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్. ప్రతీ ఏడాది దేశంలో ఏదో ఓరాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి.
ఆ రాష్ట్రాల్లో బీజేపీకి ప్రజల ఆదరణ చూరగొనడానికి బడ్జెట్ను ఉపయోగించేసుకుంటున్నారు బీజేపీ పెద్దలు. చివరికి కేరళలో ఎన్నికలున్న సమయంలో అక్కడ తమకు ఎలాంటి చాన్స్ లేకపోయినా.. దాదాపుగా రూ. ఇరవై వేల కోట్ల వరకూ మెట్రోకు కేటాయించారు. అవి మంజూరు చేశారా లేదా అన్నది తర్వాత సంగతి. ఆ వివరాలు ఎవరికీ తెలియదు. ఇప్పుడు కొత్తగా ప్రవేశ పెట్టబోయే బడ్జెట్లో కూడా ఐదు రాష్ట్రాల ఎన్నికలే హైలెట్ కానున్నాయి. యూపీ బీజేపీకి డూ ఆర్ డైగా ఉదంి. అక్కడ గెలిస్తే తప్ప వచ్చే సార్వత్రిక ఎన్నికలపై ఆశలు పెట్టుకోవడానికి లేదు. అందుకే సర్వశక్తులు ఒడ్డుతున్నారు.
అందుకే యూపీకే అత్యధిక శాతం కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఉత్తరాఖండ్, పంజాబ్ వంటి రాష్ట్రాలు కూడా ఉంటాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతరులు ఆశలు పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు. పెట్టుకుని నిరాశపడే పరిస్థితి కూడా ఉండదు. కానీ ప్రజల ముందు డ్రామాలు తప్పవు కాబట్టి.. రాజకీయ పార్టీలు.. కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా కొన్ని ఆందోళనలు చేస్తాయి. అది కూడా కామనే. అంటే అంతా రొటీన్ సీన్లే ఈ సారి బడ్జెట్లో కనిపిస్తాయన్నమాట.