చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పుపై సస్పెన్స్ కొనసాగుతోంది. తాజాగా ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు జనవరి పదిహేడో తేదీకి వాయిదా వేసింది. ఇటీవల ఏపీ ప్రభత్వం దాఖలు చేసిన చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ కూడా జనవరి 19కి వాయిదా పడింది. అప్పట్లో క్వాష్ పిటిషన్ పై తీర్పు వస్తే సరి లేకపోతే.. అప్పుడు కూడా తీర్పు కోసం వాయిదాలు పడే అవకాశం ఉంది . తాజాగా విచారణలో చంద్రబాబు కేసులకు సంబంధించిన వ్యాఖ్యలను బయట చేస్తున్నారని.. ఆయన బహిరంగంగా మాట్లాడకుండా ఆదేశాలివ్వాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు.
చంద్రబాబు తరపు లాయర్ సిద్ధార్థ లూధ్రా చంద్రబాబు ఎక్కడా కేసుల గురించి మాట్లాడలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం తరపునే అడ్వకేట్ జనరల్ తో పాటు.. సీఐడీ డీజీ పలు నగరాల్లో ప్రెస్మీట్లు పెట్టి కేసు వివరాలను.. సున్నితమైన అంశాలను, ఆరోపణలతతో చేశారననారు. ఈ వివరాలను సుప్రీంకోర్టు ముందు ఉంచాలనిప్రత్యేక దరఖాస్తు పెట్టుకోవాలని ధర్మాసనం సూచించింది తుదపరి విచారణ జనవరి 17వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు వాయిదా వేసింది. తనపై ఏపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతోందని తనకు 17ఏ వర్తిస్తుందని టీడీపీ చీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై తీర్పును సుప్రీం కోర్టు అక్టోబర్ 18వ తేదీన రిజర్వ్ చేసింది.
అప్పటి నుంచి తీర్పు పెండింగ్ లో ఉంది. గత విచారణ సమయంలో చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై తీర్పు తర్వాత విచారణ చేస్తామని తెలిపామని ఆ తీర్పు ప్రాసెస్ లో ఉన్నందున విచారణను వాయిదా వేస్తున్నామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. తీర్పు కోసం టీడీపీ వర్గాలతో పాటు వైసీపీ కూడా ఎదురు చూస్తున్నారు.