మహేష్‌బాబు – వంశీపైపడిపల్లి సినిమా పేరేంటి? ప్రస్తుతం మహేష్ అభిమానుల్ని కుదిపేస్తున్న ప్రశ్న ఇది. రేపు (గురువారం) మహేష్ జన్మదినం. ఈ సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్ ప్రకటిస్తారు. ఈలోగా `రుషి` అనే పేరు బయటకు వచ్చింది. ప్రతీ రోజూ ఓ ఇంగ్లిష్ అక్షరాన్ని బయటకు వదిలి… ప్రమోషన్‌కి శ్రీకారం చుట్టారు. అవన్నీ కలుపుకుంటే ‘రిషి’ అని తేలింది. మహేష్ బాబు సినిమా పేరు ఇదేనని అటు ఫిల్మ్‌నగర్ వర్గాలు, ఇటు అభిమానులు అనుకున్నారు. కానీ.. ఈ సినిమా పేరు ‘రిషి’ కాదు. ఇది కేవలం మహేష్ పేరు మాత్రమే. సినిమా కోసం మరో టైటిల్ ఎంచుకునే పనిలో పడింది చిత్రబృందం. ‘మహర్షి’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. రేపటిలోగా… టైటిల్ ఏమిటన్నది తేలితే… ఓకే. లేదంటే కేవలం ఫస్ట్ లుక్‌తోనే పరిపెట్టే అవకాశాలున్నాయి. నిజానికి ‘రిషి’నే సినిమా టైటిల్‌గా ఖరారు చేద్దామనుకున్నారు. కానీ… మహేష్ కి రెండక్షరాల పేర్లు నప్పకపోవడంతో.. ఈ టైటిల్‌ని పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. మరి కొత్త టైటిల్ ఏమిటో తెలియాలంటే రేపటి వరకూ ఆగాలి.