తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త చైర్మన్ ఎంపికలో చంద్రబాబు మారుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ప్రతి సారి అది రాజకీయ పదవిగానే భర్తీ చేస్తున్నారు. కానీ ఈ సారి మాత్రం రాజకీయాలకు అతీతంగా అథ్యాత్మిక ప్రముఖుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన వారికి.. పరిపాలన అనుభవం ఉన్న వారికి.. దేవదేవునిపై వంక పెట్టలేనంత భ క్తి ఉన్న వారికి అవకాశం ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
శ్రీవారి ఆలయ చైర్మన్ గా వైసీపీ నియమించినట్లుగా సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వంటి వాళ్లను నియమిస్తే ఇబ్బందులు వస్తాయి. టీటీడీ చైర్మన్ గా చేయాలని శ్రీవారికి సేవ చేసుకోవాలని ఎంతో మంది ప్రయత్నిస్తూంటారు. వీరంతా తిరుమల శ్రీవారి సన్నిధిలో చిన్న తప్పు జరిగినా మహా పాపం అనుకుంటారు. అలాంటి వారు పాలనా పగ్గాలు చేపడితే పక్కాగా అన్ని కార్యక్రమాలు జరిగిపోవడానికి ప్రాధాన్యం ఇస్తారని.. అవకతవకలకు అవకాశం ఉండదని అంచనా వేస్తున్నారు.
అధ్యాత్మికతతో పాటు కొంత పాలనా సామర్థ్యం కూడా అవసరమని భావిస్తున్నారు. ఆ దిశగా మెరుగైన చాయిస్ ఎవరైతే వారిని నియమించే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత వివాదం కారణంగా హిందూత్వ సంస్థలు, అథ్యాత్మిక వాదులూ కూడా మెచ్చేలా టీటీడీ చైర్మన్ ను నియమించాల్సి ఉంది.