జగన్ రెడ్డి భక్త ఐపీఎస్ అధికారుల్లో అగ్రగణ్యుడు అయిన పీవీ సునీల్ కుమార్ లో ఇప్పటికీ మార్పు రాలేదు. అందుకే ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం రెడీ అయింది. రఘురామపై హత్యాయత్నం చేసినట్లుగా కేసు పెట్టిన రోజున ఆయన సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుస కామెంట్లు పెట్టారు. అది సర్వీస్ రూల్స్‌కు విరుద్దమని తెలిసినా మీకు చేతనయింది చేసుకోమన్నట్లుగా వ్యవహరించారు.
ఇప్పుడు ప్రభుత్వం పద్దతి ప్రకారం చర్యలు ప్రారంభించింది. ఆయనపై సర్వీస్ రూల్స్ ఉల్లంఘించారని చార్జెస్ నమోదు చేశారు. పదిహేను రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు. ఆయన వివరణ ఎలా ఇచ్చినా సస్పెన్షన్ వేటు వేయడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల మీడియాలో వస్తున్న వార్తలపైనా ఆయన బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. తనపై ఆధారాలు లేవని..తన కాల్ రికార్డులు ఏవీ ఉండవని అంటున్నారు. తెలివి తేటలు తనకు ఒక్కడికే ఉంటాయన్నట్లుగా మాటలు చెబుతున్నారు.
అయితే ప్రభుత్వం మాత్రం ఆయన ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకుని చర్యలు తీసుకోవడానికి ప్రభత్వం సిద్ధమయింది. ఇప్పటికే చాలా కేసుల్లోఆయన ప్రమేయం ఉంది. రఘురామ కేసులో నేరుగా ఆయనను అరెస్టు చేయడానికి కొంత సమయం పడుతుంది. ఈ లోపు ఆయనపై సస్పెన్షన్ వేటు వేసే అవకాశం ఉంది. జగన్ ను మానసికంగా సంతోషపర్చడానికి ఎంత మంది టీడీపీ నేతల కుటుంబాలకు మానసిక వేదనను ఈ సునీల్ మిగిల్చారో లెక్కే లేదని విమర్శలు ఉన్నాయి.