ఎస్వీబీసీ చైర్మన్ గా కంటే నటుడిగా ప్రజలలో ఎక్కువ గుర్తింపు ఉన్న “30 ఇయర్స్ ఇండస్ట్రీ” పృథ్వి, ఎస్వీబీసీ చైర్మన్ హోదాలో సహోద్యోగిని తో జరిపిన రాసలీల సంభాషణ 99 టీవీ వెలుగులోకి తీసుకువచ్చింది. ఆడియో టేప్ లో, సహోద్యోగిని తో సరస సంభాషణ జరుపుతూ నటుడు పృథ్వి అడ్డంగా బుక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే…
ఎస్వీబీసీ చైర్మన్ హోదాలో ఎంతో హుందాగా వ్యవహరించాల్సిన ఉండగా, నటుడు పృథ్వి, ఆ హోదాను అడ్డుపెట్టుకుని మహిళా ఉద్యోగినుల తో సరస సంభాషణలు జరుపుతుండడం కలకలం సృష్టించింది. ఫోన్ లో అవతల వైపు ఉన్న మహిళ పృథ్వి తో, మీ మాటలు చూస్తుంటే తాగి మాట్లాడుతున్నట్లుగా ఉందని అంటే, తాను మందు మానేసి దాదాపు యేడాది అయిందని, ఈసారి మళ్లీ మందు తాగితే అది నీతో కలిసి కూర్చుని తాగుతానని ఆ మహిళ తో అన్నాడు నటుడు పృథ్వి. ఇవాళ మీరు ఆఫీసులో కనిపించలేదు, ఆఫీస్ కు వచ్చారా అని ఆమె అడిగితే, తాను ఆఫీస్ కు వచ్చానని, నిన్ను ( ఆ మహిళ ని) చూశానని, వెనుక నుంచి వచ్చి గట్టిగా వాటేసుకుందామనుకున్నానని, అయితే మళ్లీ నువ్వు అరిస్తే ఆఫీసు లో గోల అవుతుంది అని అలా చేయలేదు అని పృథ్వీ ఆ మహిళ తో అన్నారు. “ఎందుకో తెలియదు కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం” అంటూ మాట్లాడినంత సేపు ఆ మహిళతో సరసోక్తులను వల్లించిన పృథ్వి వ్యవహార శైలి ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
ఎన్నికలకు ముందు వైయస్ఆర్సిపి పార్టీ కి మద్దతు ఇచ్చి, ఆ మద్దతు కారణంగా ఏ ఇతర అర్హత లేకపోయినా ఎస్వీబీసీ చైర్మన్ పదవి పొందిన పృథ్వి, ఇప్పుడు పార్టీకి తలవంపులు తీసుకోవచ్చేలా ప్రవర్తిస్తున్న తీరు ని జగన్ ఉపేక్షిస్తాడా లేక కఠిన చర్యలు తీసుకుంటాడా అన్నది వేచి చూడాలి.