ఎస్వీబీసీ చైర్మన్ బాగోతం ఆడియోటేప్ ఒక్కటే కాదు. ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
పద్మావతి గెస్‌హౌస్‌లో మద్యం తాగడం..!
డబ్బులు తీసుకుని ఉద్యోగుల్ని నియమించడం..!
జీతం పెంచుతానని చెప్పి మహిళా ఉద్యోగుల్ని లోబర్చుకునే ప్రయత్నం చేయడం..!
ఈ విశేషాలన్నీ కూడా.. ఫృధ్వీ ఖాతాలో పడ్డాయి. ఎస్వీబీసీ ఉద్యోగుల సంఘం.. నేరుగా ప్రెస్‌మీట్ పెట్టి.. ఫృధ్వీ వ్యవహారాలపై తీవ్ర ఆరోపణలు చేసింది. తక్షణం ఆయనను.. పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు.
నిజానికి ఫృధ్వీ ఎస్వీబీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి.. ఓవరాక్షన్ ఓ రేంజ్లో ఉందని విమర్శలు ఉన్నాయి. ఆయన అన్నమాచార్యునిగా వేషాలు వేయడం దగ్గర్నుంచి తమిళం తెలియకపోయినప్పటికీ.. టిక్ టాక్‌లు చేస్తూ.. నవ్వుల పాలయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. సాధారణంగా ఎస్వీబీసీ చైర్మన్ అంటే.. దాన్ని ఓ రాజకీయ పదవిలానే భావించి సూచనలు, సలహాల వరకే పరిమితం అవుతారు. కానీ ఫృధ్వీ మాత్రం… ఆ చానల్‌ను తనకు రాసిచ్చేసినట్లుగా ఆయన ఫీలయ్యారు. ప్రతీ విషయంలోనూ జోక్యం చేసుకుని.. ఆర్థికంగా.. ప్రయోజనాలు వెదుక్కునే ప్రయత్నం చేశారనే ఆరోపణలు మొదటి నుంచే వెల్లువెత్తాయి.
ఈ క్రమంలో.. కొద్ది రోజుల క్రితం.. 36 మంది ఉద్యోగుల్ని ఫృధ్వీ అక్రమంగా నియమించారు. అలా ఎలా నియమించారని.. అనేక విమర్శలు వచ్చిన ఆయన వెనక్కు తగ్గలేదు. చేరిన వారంతా.. తాము డబ్బులిచ్చి చేరామని బహిరంగంగానే చెప్పుకున్నారు. ఈ వివాదం.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దృష్టికి వెళ్లడంతో.. ఆయన ఫృధ్వీని మందలించినట్లు సమాచారం. ఆ తర్వాత కూడా ఫృధ్వీ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఫృధ్వీ సహజసిద్ధమైన స్త్రీలోలుడనే ప్రచారం ముందు నుంచీ ఉంది. దాన్ని ఎస్వీబీసీలో నిజం చేశారు. ఇద్దరు మహిళల్ని ట్రాప్ చేసినట్లుగా కూడా… టీటీడీ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ వ్యవహారాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
అమరావతి రైతుల విషయంలో ఫృధ్వీ చేసిన వ్యాఖ్యలే కలకలం రేపుతూంటే… ఇప్పుడు.. లైంగిక వేధింపులకు పాల్పడటం.. వైసీపీకి చిరాకు తెప్పిస్తోంది. ఫృధ్వీపై చర్యలు తీసుకుంటామంటూ..మీడియాకు ఆ పార్టీ వర్గాలు సమాచారం ఇస్తున్నాయి. ఈ మొత్తం ఘటనపై.. వైవీ సుబ్బారెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అయితే.. వైసీపీలో ఇలాంటి వ్యవహారాలు ప్లస్ గా మారుతాయి కానీ.. మైనస్ కాదని.. ఆ పార్టీ నేతలు అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. క్లీన్ చిట్ ఇప్పించి.. పదవిలో కొనసాగిస్తారని.. చర్యలు తీసుకోరని.. అంటున్నారు.
36 మంది ఉద్యోగులను ఇష్టానుసారం నియమించి, డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఈ విషయం తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డికి తెలిసి పృథ్వీరాజ్‌ను మందలించడంతో 30 మందిని తొలగించారని చెప్పారు. పృథ్వీరాజ్ రాసలీల వ్యవహారంపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. వెంటనే ఆయనని ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి తొలగించి ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.