రాజకీయాలపై ఆశలు పెట్టుకున్న స్వాములు రాగద్వేషాలకు అతీతులేమీ కాదు. దానికి పరిపూర్ణానందనే సాక్ష్యం. హిందూపురం లోక్ సభ సీటు తనకు దక్కనివ్వలేదని రగిలిపోతున్న ఆయన ఎగ్జిట్ పోల్ చెప్పారు. హిందూపురం అసెంబ్లీకి ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఆయన … కౌంటింగ్ కు ముందు రోజు మరోసారి హిందూపురం చేరుకున్నారు. మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని తనకు సమాచారం ఉందని చెప్పుకొచ్చారు.
వైసీపీ 123 సీట్లతో అధికారంలోకి వస్తుందని నాకు సమాచారం ఉందని చెప్పుకొచ్చారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ సమాచారం ఉందని డైలాగ్ తరచూ వినిపిస్తోంది. మొదట కేసీఆర్, కేటీఆర్ అన్నారు. తర్వాత కోమటిరెడ్డి అన్నారు. ఇప్పుడు పరిపూర్ణానంద అంటున్నారు. ఎన్నికలు జరిగితే ఎక్కడి నుంచి సమాచారం వస్తుందో కానీ.. వీరంతా ఎలా చెబుతున్నారో చాలా మందికి అర్థం కావడం లేదు.
వారికి ఎవరు సమాచారం ఇస్తున్నారు… వైసీపీ గెలుస్తుందని ఆ సమాచారం ఇచ్చే వారికి ఎలా తెలుసు అన్నది వీరు ఎందుకు వెరీఫై చేసుకోరో కానీ… ఫలితం బ్యాలెట్ బాక్సుల్లో ఉంది. కూటమి ఏపీలో క్లీన్ స్వీప్ చేస్తుందని జాతీయ మీడియా సమాచారం ఇచ్చింది. అయినా తను అగ్గిపెట్టే గుర్తు మీద పోటీ చేస్తే నాలుగైదు వందల ఓట్లు వస్తాయో లేదో కూడా.. పరిపూర్ణానందకు సమాచారం ఇచ్చేవారు లేరా ?