సీఐడీ సునీల్‌పై వచ్చిన ఫిర్యాదుల విషయంలో చర్యలు తీసుకునే బాధ్యతను ఏపీ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మీ డీజీపీ గౌతం సవాంగ్‌కు ఇచ్చారు. గతంలో కేంద్ర హోంశాఖ నుంచి వచ్చిన లేఖలు.. వాటికి జత చేస్తూ వచ్చిన ఫిర్యాదు లేఖలపై ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్ర హోంశాఖ నుంచి ఒత్తిడి వస్తూండటంతో కొత్త చీఫ్ సెక్రటరీ ఫైల్‌ను ముందుకు కదిలించారు. పోలీస్ డిపార్టుమెంట్ బాస్ కాబట్టి.. చర్యల విషయంలో తగు నిర్ణయాలు తీసుకోవాలని ఆయన డీజీపీకి పంపించారు.
సునీల్ కుమార్‌పై ప్రధానంగా ఉన్న కేసు ఆయన పై భార్య పెట్టిన కేసు. దీనిపై తెలంగాణలో కేసు ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన కీలకమైన బాధ్యతల్లో ఉండటానికి వీల్లేదు. ఆ కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత .. సచ్చీలుడుగా ఉన్నప్పుడే కీలక పోస్టుల్లో ఉండాలి. కానీ ఆయనకు ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉండటంతో సీఐడీ చీఫ్‌గా ఉన్నారు. కేంద్ర హోంశాఖకు ఫిర్యాదులు వెల్లువెత్తినా ఆయనను కదపడం లేదు.
సీఐడీ చీఫ్‌గా విధి నిర్వహణ విషయంలోనూ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో పోలీస్ బాస్‌తోనూ ఆయనకు సరిపడటం లేదన్న ప్రచారం ఉంది. ఈ క్రమంలో డీజీపీ సవాంగ్ ఏం చర్యలు తీసుకుంటారన్నదాననిపై ఆసక్తి ఏర్పడింది. అయితే ప్రభుత్వ పెద్దల ఇష్టం లేకుండా డీజీపీ కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేరన్న చర్చ నడుస్తోంది.