తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రాజగురువుగా మారిన స్వరూపానందస్వామి .. ఉగాది రోజు.. ఓ మాట సెలివిచ్చారు. అదేమిటంటే.. ప్రస్తుతం దేశంలో… కరోనా లాంటి వైరస్‌తో గడ్డు పరిస్థితులు ఏర్పడటానికి కాల సర్పదోషమే కారణమట. మే 15వ తేదీ వరకూ ఈ పరిస్థితులు ఉంటాయని తేల్చారు. విశాఖలోని తన పీఠంలో ఉగాది వేడుకలు నిర్వహించిన స్వరూపానంద.. తర్వాత తన ఉగాది ప్రకటన చేశారు. దీనికి ఎవర్నీ ఆహ్వాంచలేదు… కానీ వైసీపీ అధినేతకు ఆప్తులు కాబట్టి సాక్షి మీడియా మాత్రం… ఆయన ఉగాది రోజున ఏం మాట్లాడారో తెలుసుకుని కాస్త ప్రాముఖ్యత ఇచ్చి ప్రచురించింది. పేజీల సంఖ్యను తగ్గించేసి.. వార్తల సంఖ్యను కుదించేసిన సమయంలోనూ… ఫోటో వేసి మరీ.. ఆయన మాట్లాడిన మాటలు ప్రాధాన్యం ఇవ్వడం అంటే ఆలోచించాల్సిందే.
మే పదిహేను వరకూ పరిస్థితులు ఇలాగే ఉంటాయంటే… ఆయన లాక్ డౌన్ గురించి చెప్పి ఉండవచ్చు. ఏప్రిల్ 14వరకూ.. కేంద్రం ఎలాగూ లాక్ డౌన్ ప్రకటించేసింది. కాబట్టి.. స్వరూపానంద చెప్పినా.. చెప్పకపోయినా… పరిస్థితులు మారవు. ఆ తర్వాత మెరుగుపడతాయా.. అంటే.. దానిపై స్వరూపానంద క్లారిటీ ఇవ్వలేదు. మే లోపు.. భారత్‌లో .. మూడు లక్షల వరకూ కరోనా కేసులు నమోదవుతాయని..నిపుణులు చెబుతున్నారు. బహుశా.. ఈ విషయాన్నే స్వరూపానంద.. తనకు అనుకూలంగా మార్చుకుని చెప్పారు. ఆ తర్వాత పరిస్థితులు విషమిస్తే.. ఇంకేమైనా కొత్తగా చెప్పే అవకాశం ఉంది.
అయితే.. స్వరూపానంద కాలసర్ప దోషమని చెప్పడం.. దాన్ని సాక్షి ప్రాధాన్యత ఇవ్వడంతోనే కాస్త సందేహం అందరికీ వస్తోంది. ఆ సందేహం.. కొంపదీసి.. యాగాలు ఏమైనా చేయమని.. ప్రభుత్వాలకు సలహా ఇస్తాడా. .. అని..! ఎందుకంటే.. ఆయన మాటే వేదవాక్కుగా.. భావించే పాలకులు ఉన్నారు మరి…!