జగన్‌లో హిందూ ధర్మ పరిరక్షకుడ్ని చూసేవాళ్లు ఆంధ్రప్రదేశ్‌లో ఎంత మంది ఉంటారు..?. వైసీపీ నేతలయితే చూస్తారు. ఇక బీజేపీ నేతలయితే.. గత కొన్ని రోజులుగా… ఏపీలో ఓ మత వ్యాప్తి కోసం జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. పాస్టర్లకు జీతాలు, చర్చిలకు పోలీసుల రక్షణ లాంటివి మాత్రమే కాదు… ఆలయాల్లో అన్యమతస్తుల హడావుడి కూడా.. కొద్ది రోజులుగా పెరిగిపోయింది. టీటీడీ బోర్డు నియామకాలు, కృష్ణాహారతి నిలిపివేయడం… వంటివి జరిగినా.. కనీసం స్పందించని.. స్వరూపానంద.. . జగన్మోహన్ రెడ్డికి హిందూ ధర్మ రక్షకుడి బిరుదుతో… స్వరూపానంద తెరపైకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ప్రకటనలు చేస్తే.. శిక్షులు, ఆయనను నమ్మేవారు కూడా… నమ్మరని అనుకున్నారేమో కానీ.. వెళ్లి తమిళనాడులో ఇలాంటి ప్రవచనాలు ఇస్తున్నారు.
హిందూ ధర్మం ఎటు పోయినా పర్వాలేదు.. తాను మాత్రం జగన్‌ను రక్షించాలని ఆయన అనుకుంటున్నట్లుగా స్వరూపానంద తీరు ఉన్నట్లు విమర్శలు ప్రారంభమయ్యాయి. స్వరూపానంద… అమరావతిలో ఆశ్రమం కట్టుకోవడావికి ఆరు ఎకరాల స్థలం కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రక్రియ కొనసాగుతోందని చెబుతున్నారు. అందుకే.. జగన్మోహన్ రెడ్డిని మెప్పించేందుకు హిందూ ధర్మపరిరక్షణకు ముడిపెట్టి బిరుదులు ఇస్తున్నారని చెబుతున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు యాగాలు చేయడం ద్వారా ఆయన మెప్పును పొందిన స్వరూపానంద.. కోకాపేటలో.. దాదాపుగా వంద కోట్ల విలువైన రెండు ఎకరాల భూమిని .. రూ. రెండు రూపాయలకే సొంతం చేసుకున్నారు. ఇప్పుడు అమరావతి వంతు..!
స్వాములకు వ్యక్తిగతరాగద్వేషాలు ఉండకూడదు. సర్వం త్యజించినవాడే సన్యాసి. దురదృష్టవశాత్తూ.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ స్వాములు రాజకీయ నేతల్ని మంచి పోతున్నారు. రాజకీయ నేతల ప్రాపకం కోసం.. హిందూ ధర్మాన్ని సైతం కాల రాయడానికి వెనుకాడటం లేదు. ప్రభుత్వం నుంచి పొందే ప్రయోజనాలు.. వారి వద్ద పలుకుబడి కొనసాగించేందుకు … దేనికైనా వెనుకాడటం లేదు. గత ప్రభుత్వంలో చీమ చిటుక్కుమన్నా.. శాపాలతో కమండలాలు పట్టుకుని బయలుదేరిన స్వాములు.. ఇప్పుడు.. మాత్రం.. నోరు తెరవలేకపోతున్నారు. దేవుడ్ని రాజకీయాలకు వాడుకుని… ఆ దేవుడ్నే నిరాదరణకు గురి చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.