గిరిజనుల్లో మత మార్పిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయని వాటిని అరికట్టడానికి హిందూధర్మ ప్రచారానికిప్రత్యేకంగా ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లుగా స్వరూపానంద తిరుమలలో ప్రకటించారు. విద్యుత్, షెల్టర్ లేని ప్రాంతాలలో మతాల చిచ్చు పెట్టి విదేశీ మతాల దాటికి మోసపోతున్న గిరిజనులను కాపాడేందుకు ట్రస్ట్ ప్రారంభిస్తున్నామని ఆయన తిరుమలలో తెలిపారు. దానికి స్వధర్మ వాహిని అనే పేరు పెట్టారు. దానికో మూడు గుల చిహ్నం ఏర్పాటు చేస్తున్నారు.
అందులో బులుగుకు స్పేస్ దక్కలేదు. పసుపు, కుంకుమ, తెలుపు వర్ణాలతో ఉంటుందని.. పసుపు మనిషిలో ఉన్న కల్మషాన్ని, కుతంత్రాని పోగొడితే, తెలుపు ధర్మ పథం వైపు నడుపుతుందన్నారు. కుంకుమ జ్ఞాననేత్రానికి సంకేమన్నారు. తమ ట్రస్ట్ గిరిజన, హరిజన ప్రాంతాల్లో హిందూ ధర్మ ప్రచారం చేయడం కోసం స్థాపిస్తున్నాంమని స్పష్టం చేశారు. అన్ని ఆశ్రమాలు, స్వాములు, వారి ప్రసంగాలు పట్టణాలకే పరిమితం అయ్యాయని.. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో హిందూ ధర్మప్రచారం చేయడానికి ఏ ధార్మిక సంస్థ పూనుకోవడం లేదని అందుకే తాము రంగంలోకి దిగుతున్నామన్నారు.
హిందూ ధర్మప్రచారం గిరిజన ప్రాంతాల్లో వ్యాప్తం చేయడమే ముఖ్య ఉద్దేశంని.. కులాలు హిందూమతంలో లేవని స్వరూపానంద చెబుతున్నారు. విదేశాల్లో,స్వదేశంలో ఉన్న శారదా పీఠం భక్తులు ట్రస్ట్ కార్యకలాపాల్లో పాల్గొంటారు కానీ టీటీడీకి మాకు ఎలాంటి సంబంధం లేదని.. నిధులు టీటీడీ ఇవ్వడం లేదని ప్రకటించారు. ఏపీలో మత మార్పిళ్లపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న సమయంలో స్వరూపానంద ప్రకటన కాస్త ఆశ్చర్యకరంగానే ఉందని వైసీపీ వర్గాలు కూడా భావిస్తున్నాయి.