బెల్లం కొండ గణేశ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన చిత్రం ‘స్వాతిముత్యం’. లక్ష్మణ్ కె.కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. స్వాతిముత్యంలాంటి ఓ యువకుడి కథతో రూపొందిన ఈ సినిమాని దసరా సందర్భంగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ బయటికి వచ్చింది. ఫన్ ఫ్యామిలీ రోమాన్స్ ఎమోషన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ చక్కగా కుదిరాయి ట్రైలర్ లో . ప్రేమ, పెళ్లి పట్ల ఆలోచనలు, అభిప్రాయాల మధ్య సాగిన ఓ యువకుడి ప్రయాణమే ఈ చిత్రమని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. ప్రేమ, వినోదం, కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలకి పెద్ద పీట వేస్తూ ట్రైలర్ సాగింది.
ట్రైలర్ లో బెల్లం కొండ గణేష్ నటన ఆకట్టుకుంది. గణేష్ ఎక్స్ ప్రెషన్ చాలా నేచురల్ గా వున్నాయి. డైలాగ్ లో కూడా మంచి టైమింగ్ వుంది. అలాగే గణేష్ వర్ష బొల్లమ్మ కెమిస్ట్రీ కూడా బావుంది. సరదాగా సాగిపోతున్న ప్రేమకథలో ఒక సమస్య రావడం దాని తర్వాత డ్రామా ఊహించని మలుపు తీసుకోవడం ట్రైలర్ లో ఆసక్తికరంగా వుంది. మహతి స్వరసాగర్ నేపధ్య సంగీతం ఆకట్టుకుంది. దసరాకి మంచి ఫ్యామిలీ ఎంటర్ కాబోతుందని ఈ ట్రైలర్ నమ్మకం కలిగించింది.