శారదాపీఠం అని ఎవరైనా గుర్తు చేస్తే అది వైసీపీ బ్రాంచ్ ఆఫీస్ అని ఆటోమేటిక్ గా మనసులో మెదిలిపోతుంది. ఏపీ ప్రభుత్వంలో శారదా పీఠానికి ఉన్న ప్రయారిటీ గురించి అందిరకీ తెలుసు. దేవాదాయశాఖ మంత్రి ఎవరైనా.. మొత్తం స్వరూపానందకనుసల్లో ఉంటుందని చెబుతారు. అయితే ఆయన మేనల్లుడు.. శారదా పీఠానికి వారసుడిగా ప్రకటించేసిన స్వాత్మానందేంద్ర మాత్రం.. అసలు శారదా పీఠం ఏ పార్టీకి కొమ్ము కాయనది ప్రకటించేశారు.
హర్యానాలోని కురుక్షేత్రంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న స్వాత్మానందేంద్ర తమ మఠంపై ఓ పార్టీ ముద్ర వేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఒక పార్టీ అధికారంలోకి రావాలని యజ్ఞ యాగాదులు చేయమన్నారు. దేశం సస్యశ్యామలంగా ఉండాలన్నదే తమ కోరిక అని, ప్రజల క్షేమం కోసం తమ పీఠం పాటుపడుతుందని తెలిపారు. శారదాపీఠంపై కొందరు రాజకీయ ముద్ర వేయాలని చూశారని… అయితే శారదాపీఠం ధర్మం వైపు నడుస్తుందని స్పష్టం చేశారు. భారతదేశంలో హిందూ ధర్మాన్ని వేగంగా వ్యాప్తి చేయాలనేదే తమ లక్ష్యమన్నారు.
అసలు స్వరూపానందకు రాజకీయాలు ఎందుకని చాలా ామంది విమర్శలు చేస్తూంటారు. అయితే స్వరూపానంద మాత్రం ఇటీవలి కాలంలో ప్రభుత్వ అధినేతల వద్ద ప్రాపకం సంపాదించుకున్నారు. కానీ వారు కూడా దూరం పెడుతున్న సంకేతాలు కనిపిస్తూండటంతో.. ఇప్పుడు ఢిల్లీలో ఆయన వారసుడితో ఇలాంటి ప్రకటనలు చేయిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.