మెగాస్టార్ చిరంజీవి పీరియాడిక్ మూవీ సైరా. రామ్ చరణ్ నిర్మాత. ఈ సినిమా ఔట్ పుట్ మీద తరచు వార్తలు వస్తూనే వున్నాయి. చిరంజీవికి దర్శకుడు సురేందర్ రెడ్డి వర్కింగ్ స్టయిల్ నప్పడం లేదని, ఔట్ పుట్ మీద అసంతృప్తిగా వున్నారని చాలా సార్లు గ్యాసిప్ లు దర్శనం ఇచ్చాయి.
ఇప్పుడు కొన్ని కీలక సన్నివేశాల విషయంలో చిరంజీవి పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడం లేదని, తన ఆస్థాన నమ్మకస్థులు పరుచూరి బ్రదర్స్, సత్యానంద్ లంటి వాళ్లకు చూపించి, సలహాలు తీసుకుని, రీషూట్ లు, మార్పులు చేర్పులు చేయిస్తున్నారని గ్యాసిప్ వినిపిస్తోంది.
పరుచూరి బ్రదర్స్ చేయిపెడుతున్నారని వినిపిస్తూ వుంటే అభిమానులు కలవరపడుతున్నారు. పాత అయిడియాలతో పరుచూరి బ్రదర్స్ సినిమాను ఎక్కడ తప్పు దారి పట్టిస్తారో అన్న భయాలు వినిపిస్తున్నాయి.
సైరా సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. సినిమా అక్టోబర్ 2 న విడుదల లక్ష్యంగా రెడీ అవుతోంది.