మెగాస్టార్ చిరంజీవి ప్రిస్టీజియస్ ప్రాజెక్టు సైరా నరసింహారెడ్డి మరోసారి వాయిదా పడింది. ఫిబ్రవరిలో జరగాల్సిన 2 వ షెడ్యూలు ఏకంగా మార్చి 3 వారానికి వాయిదా పడింది ఇప్పటికే పలు రూమర్లు, పలు వాయిదాలు ఎదుర్కొంటున్న ఈ సినిమా మరొకసారి షూటింగ్ వాయిదా పడడం మెగా అభిమానులకు నిరుత్సాహం ఇచ్చేదే.
ఇంతకీ ఈ సినిమాకి మరోసారి వాయిదా పడడానికి కారణం సినిమాటోగ్రాఫర్ రత్నవేలు డేట్స్ కుదరక పోవడం అని తెలుస్తోంది. అయితే రత్నవేలు రంగస్థలం సినిమా కు కూడా పనిచేస్తున్నారు. రంగస్థలం సినిమా ని సుకుమార్ మళ్లీ మళ్లీ చెక్కడంతో రీ షూట్ కోసం రత్నవేలు డేట్లు కావాల్సి వచ్చింది. దీంతో సైరా సినిమా కోసం అనుకున్న ఆ డేట్లు సుకుమార్ కోసం ఇవ్వాల్సి వచ్చింది. దాంతో ఇప్పుడు సైరా సినిమా షూటింగ్ వాయిదా పడక తప్పలేదు.
మొత్తానికి సుకుమార్ మరొక సినిమాలో చెప్పిన బటర్ ఫ్లై ఎఫెక్ట్ లాగా రంగస్థలం రీషూట్ సైరా సినిమా ని షూటింగ్ వాయిదా పడేలా చేశాయి.