‘సైరా’ షూటింగ్ ని వీలైనంత త్వరగా ముగించాలని చిత్రం బృందం భావిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ మే నాటికి షూటింగ్ పూర్తి చేయాలని రామ్ చరణ్ కూడా అల్టీమేటం జారీ జేసినట్టు భోగట్టా. ఎందుకంటే.. సైరా కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కి చాలా సమయం పట్టేటట్టు వుంది. సీజీ వర్క్స్ ఎప్పుడు పూర్తవుతాయో ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. సీజీ కి వీలైనంత సమయం కేటాయించాలంటే.. షూటింగ్ త్వరగా ముగించడం చాలా అవసరం.
అనుదుకే చిత్ర బృందం ఓ నిర్ణయం తీసుకుంది. ఈ సినిమాలో ‘అంత ప్రాధాన్యం లేదు’ అనుకున్న కొన్ని సన్నివేశాలకు ముందే తొలగించేశారు. అంటే స్క్రిప్ట్ దశలోనే ఎడిటింగ్ జరిగిపోయిందన్న మాట. సినిమా చూసుకుని నిడివి ఎక్కువయిందని కొన్ని సన్నివేశాలకు కత్తెర్లు వేయాల్సి వస్తుంటుంది. అదేదో ముందే నిర్ణయం తీసేసుకుంటే, సమయం… డబ్బు ఆదా అవుతాయన్నది చరణ్ ఆలోచన. అందుకే… కొన్ని సన్నివేశాలను షూటింగ్ చేయకుండానే తొలగించారు. ఈ సినిమా కోసం 5 పాటలు కంపోజ్ చేసినట్టు టాక్. అందులో రెండు పాటలు బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్ రూపం లో వినిపిస్తాయి. 5 పాటల్లో 4 మాత్రమే షూట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆడియో లో 5 పాటలు వినిపించినా సినిమాలో మాత్రం 4 మాత్రమే ఉంటాయి. వీటి వల్ల అనుకున్న సమయానికి సైరా పూర్తి చేయడమే కాదు. కాస్త బడ్జెట్ ని కూడా తగ్గించుకోవచ్చని చరణ్ భావిస్తున్నాడు.