తెలంగాణా శాసనసభ ఇవ్వాళ సమావేశమయిన తరువాత ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకట రెడ్డి మృతికి సంతాపం తెలిపిన తరువాత సభ రేపటికి వాయిదా పడింది. అనంతరం శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బి.ఏ.సి) సమావేశమయ్యి శాసనసభ షెడ్యూల్ మరియు అజెండాని ఖరారు చేసింది. ఈ నెల 14న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతారు. దానిపై 16,17,18 వ తేదీలలో చర్చిస్తారు. ఈ నెల 29వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. అదే రోజున మళ్ళీ బి.ఏ.సి మరొకసారి సమావేశమయ్యి అవసరమయితే మరొక రెండుమూడు రోజుల పాటు శాసనసభ సమావేశాలు పొడిగించే అవకాశముంది. మార్చి 15,23,25 తేదీలలో శాసనసభకు శలవుంటుంది.