ట్విట్టర్లో చురుగ్గా ఉండే మంత్రి కేటీఆర్ అనూహ్యంగా తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్‌ను బ్లాక్ చేశారు. ఎందుకు అలా బ్లాక్ చేశారో స్పష్టత లేదు. ఎమ్మెల్సీ కవిత రాహుల్ గాంధీ పర్యటనపై విమర్శలతో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు రేవంత్ రెడ్డితో పాటు టీ కాంగ్రెస్ కూడా రిప్లయ్ ఇచ్చింది. కానీ అనూహ్యంగా తెంలగాణ కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్‌ను ఆయన బ్లాక్ చేశారు. దీనిపై కాంగ్రెస్ నేతలు వెంటనే విమర్శలు చేశారు. తమను కేటీఆర్ బ్లాక్ చేశారని స్క్రీన్ షాట్ తీసి పెట్టి..పిరికి పింకీ అని ప్రారంభించారు.
తర్వాత ట్విట్టర్ పిట్ట తోకముడిచింది. ప్రశ్నను చూసి గజగజ వణికింది. ప్రజల తరపున అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఒక జాతీయ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ను బ్లాక్ చేయడం కేటీఆర్ మానసిక స్థితికి అద్దం పడుతోందని మరో ట్వీట్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మామిగం ఠాగూర్ కూడా స్పందించారు. కేటీఆర్ ట్విట్టర్‌ను తాము అసలు పట్టించుకోబోమన్నారు.
కేటీఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీట్విట్టర్ హ్యాండిన్ బ్లాక్ చేసింది తన పర్సనల్ అకౌంట్ నుండే. మామూలుగా అయితే అసభ్యకరంగా కామెంట్లు పెట్టే వారిని ఎక్కువ మంది బ్లాక్ చేస్తూ ఉంటారు. ఓ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్‌ను బ్లాక్ చేయడం అసాధారణమే. ఎందుకు బ్లాక్ చేశారన్నదానిపై కేటీఆర్ వైపు నుంచి కానీ.. ఆయన టీం వైపు నుంచి కానీ స్పష్టత లేదు. కాంగ్రెస్ నేతల విమర్శలతో ఏమైనా స్పందిస్తారేమో చూడాలి !