మున్సిపల్ చట్టాన్ని ఆమోదించేందుకు ప్రత్యేకంగా సమావేశపరిచిన అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోల్పోయిన కాంగ్రెస్ కాస్త హడావుడి చేయగలిగింది. అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన బిల్లులపై మాట్లాడే సందర్భంలో… పార్టీ ఫిరాయింపుల అంశాన్ని లేవనెత్తారు. స్పీకర్‌తో పాటు టీఆర్ఎస్ సభ్యులు కూడా.. నిరసన వ్యక్తం చేస్తున్నా.. భట్టి విక్రమార్క.. ఫిరాయింపులపైనే మట్లాడే ప్రయత్నం చేశారు. ఫిరాయింపుల పై సభలో మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం తో సేవ్ డెమోక్రసీ ఫ్లకార్డులు పట్టుకుని సభలో కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలిపారు. సభలోకి కూడా నల్ల కండువాలతో వచ్చారు. మిగిలిన ఆరుగురు ఎమ్మెల్యేలతో భట్టి అసెంబ్లీ సమావేశానికి ముందే సమావేశం ఏర్పాటు చేశారు.దీనికి కోమటిరెడ్డి రాజగోపాల్హాజరు కాలేదు. కానీ సభకు హాజరయ్యారు. అయినా సభలోకాంగ్రెస్ సభ్యుల నిరసనకు తన మద్దతు తెలియచేయలేదు. మరో ఎమ్మెల్యే జగ్గారెడ్డి సభకు హాజరైనా నల్ల కండువా మాత్రం వేసుకోలేదు. సభలో కూడా నిరసన సందర్బంగా ఫ్లకార్డు పెట్టుకోకుండా ఆయన సభనుండి బయటకు వచ్చేశారు. దాంతో ఉన్న ఆరుగురిలో కూడా ఐక్యత లేదని తేలిపోయింది.
అయితే..నలుగురు ఎమ్మెల్యేల నిరసనపై.. కేసీఆర్ స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే లు వద్దన్నా తమ పార్టీ లోకి వస్తున్నారని చెప్పుకొచ్చారు. రాజ్యాంగ బద్దంగానే వారు విలీనం అయ్యారని ప్రకటించారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లు సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేసారు…ఇక సభలో చివరి బిల్లు ప్రవేశ పెట్టిన కొద్దిసేపటికి సభ జరుగుతున్న తీరుకు , మాకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వనుందుకు సభను వాకౌట్ చేస్తున్నామని భట్టి విక్రమార్క ప్రకటించి తమ పార్టీ సభ్యులతో కలిసి సభనుండి బయటకు వెళ్లిపోయారు. వాకౌట్ చేసిన త్వరాత కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోచారం ను కలసి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ల పై వేటు వేయాలని కోరారు. సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు నిరసన వ్యక్తం చేశారు.
ఉదయం సీఎల్పీ భేటీకి హాజరు కాని ఆ తర్వాత సభలో కాంగ్రెస్ నిరస కూడా తనకు పట్టనట్లుగా వ్యవహరించిన రాజగోపాల్ రెడ్డి..స్పీకర్‌ను కలిసినప్పుడు మాత్రం.. కాంగ్రెస్ సభ్యులతో కలిసి వెళ్లారు. అయితే భేటీ ముగిసిన వెంటనే.. మళ్లీ మీడియా ముందుకు వచ్చి సొంత నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. జగ్గారెడ్డి .. మొత్తానికి తనకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు. కొద్దిరోజులుగా ఆయన సంగారెడ్డి నీటి సమస్యపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయినప్పటికీ… కాంగ్రెస్ నేతలెవరూ తనకు మద్దతుగా రావడం లేదని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు.