అజ్ఞాతవాసి విడుదలకు ముందు.. టీ సిరీస్ వ్యవహారం కాస్త టెన్షన్ తెచ్చి పెట్టింది. ఫ్రెంచ్ సినిమాని అజ్ఞాతవాసి కోసం కాపీ కొట్టారని, సదరు ఫ్రెంచ్ సినిమా రైట్స్ టీ సిరీస్ దగ్గర ఉన్నాయని, రానా మధ్యవర్తిత్వం వహించి ఈ విషయాన్ని సెటిల్ చేశారని.. మీడియాలో పుంకాను పుంకాలుగా వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకూ ఎవ్వరికీ తెలియని విషయం ఏమిటంటే.. టీ సిరీస్ సంస్థ కేవలం అజ్ఞాతవాసికే కాదు, మరో రెండు సినిమాలకూ ఇలాంటి నోటీసులనే పంపిందట. పరభాషా చిత్రాలు, హాలీవుడ్ సినిమాల రీమేక్ రైట్స్ కొన్ని టీ సిరీస్ దగ్గర ఉన్నాయి. తమ దగ్గర ఉన్న కథల్ని వేరే హీరో ల సినిమాల కోసం కాపీ కొడుతున్నారని, చూచాయిగా టీ సిరీస్‌కి తెలిసింది. అందుకే… మరో రెండు సినిమాలకూ టీ సిరీస్ నోటీసులు పంపిందని తెలుస్తోంది. ఆ కథలకూ, అజ్ఞాతవాసి కథకీ ఏమైనా లింకు ఉందా? లేదంటే మిగిలిన రెండూ వేర్వేరు కథలా అనేది మాత్రం తెలియాల్సివుంది. అన్నట్టు.. టీ సిరీస్ నోటీసులు పంపిన ఆ రెండు సినిమాల్లోనూ స్టార్ హీరోలే నటిస్తున్నారు. అవి రెండూ ఈ వేసవికి విడుదల కాబోతున్నాయి.