ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ… తొలిసారి టీ 20 వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. ఈరోజు దుబాయ్‌లో జరిగిన ఫైనల్ లో న్యూజీలాండ్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన న్యూజీలాండ్ నిర్ణీత 20 ఓవర్లకు 4 వికెట్లు నష్టపోయి 172 పరుగుల భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ విలియమ్సన్ 48 బంతుల్లోనే 85 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. గుప్తిల్ 28 (35) పరుగులతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో హజ్లీవుడ్ 16 పరుగులకు మూడు వికెట్లు తీసి కివీస్ ని కట్టడి చేశాడు. అనంతరం బ్యాటింగ్ కి దిగిన ఆసీస్‌కి తొలి ఓవర్లలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఫించ్ (5) త్వరగా అవుట్ అయి పెవీలియన్ చేరాడు. అయితే ఆ తరవాత మిచెల్ మార్ష్ (77 నాటౌట్), వార్నర్ (53) రెండో వికెట్ కి 92 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. చివర్లో మాక్స్వెల్ (28) మెరుపులు మెరిపించడంతో… ఆసీస్ మరో 7 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 50 ఓవర్ల వరల్డ్ కప్ ని పలుసార్లు అందుకున్న ఆసీస్‌కి ఇదే తొలి టీ 20 వరల్డ్ కప్.