తెలుగు 360 జిల్లాల వారీగా… పకడ్బందీగా చేసిన సర్వే ఫలితాలను రోజువారీగా ప్రకటించారు. ఇక … అన్నింటినీ కలిపి.. ఓవరాల్ సర్వే ఫలితాలను ఈ రోజు ప్రకటిస్తున్నారు. మేం జిల్లాల వారీగా సర్వేలు ప్రకటించడం ప్రారంభించి.. చివరి దశకు వచ్చిన తర్వాత వివిధ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు, జాతీయ మీడియా చానళ్లు కూడా… తమ తమ సర్వే ఫలితాలు వెల్లడించాయి. దాదాపుగా.. తెలుగు 360కి అన్నీ అటూ ఇటూగా ఉన్నాయి. ఇది.. మా సర్వే మెకానిజంలో… పొరపాటు లేదని… నమ్మకం కలిగించగలిగాయి. చాలా పరిమితమైన వనరులతో… అత్యంత పకడ్బందీగా మేం చేసిన తొలి ప్రయత్నం ఇది.
పదమూడు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో… మొత్తం 175 అసెంబ్లీ సీట్లలో తెలుగుదేశం పార్టీ ఈ సారి 108 సీట్లు గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అరవై, పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి ఏడు సీట్లు వస్తాయని.. తెలుగు 360 సర్వేలో స్పష్టం చేసింది. నెల్లూరు, కడప జిల్లాల్లో మాత్రమే… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయి. మిగిలిన చోట్ల.. టీడీపీనే ఆధిక్యం చూపించనుంది.
ఏ సర్వేకు అయినా.. ఐదు నుంచి పదిశాతం…మార్జిన్ ఉంటుంది. ఐదు నుంచి పదిశాతం ఫలితాలు… అటూ ఇటూ కావొచ్చు. ఎన్నికల ప్రచారం ఊపందుకునే కొద్దీ… రాజకీయం కూడా… కాస్త మార్పువచ్చింది. పదిహేను రోజుల కిందట.. సర్వే ఫలితాలను ఎనాలసిస్ చేయడం ప్రారంభించిన తర్వాత… రాజకీయం మరింతగా.. పొలరైజ్ అయింది. జనసేన అధినేత బలంగా.. తాను ప్రత్యామ్నాయం అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయారు. ఈ పరిణామం చూస్తే.. అంతిమ ఫలితాల్లో జనసేన మరింత నష్టపోయే అవకాశం ఉంది. అలాగే… చివరి వారం రోజుల్లో చంద్రబాబు చాలా స్ట్రాటజిక్ గా వ్యవహరించారు. నేరుగా ఓటర్లపై ప్రభావం చూపేలా… పెన్షన్లు, మహిళలకు రూ. నాలుగు వేలు, నాలుగో విడత రుణమాఫీ వంటివి పంపిణీ చేశారు. ఇవన్నీ.. ఓటర్ల మనసుల్ని ఎంతో కొంత ప్రభావం చూపేవి. ఎంత ప్రభావం చూపుతాయనే విషయంపై ఇప్పటికిప్పుడు అంచనా వేయడం కష్టం. మొత్తం ఫలితాల్లో మాత్రం పెద్దగా మార్పు రాకపోవచ్చనేది.. తెలుగు360 సర్వే బృందం అంచనా.
టీడీపీ | వైసీపీ | జనసేన | |
---|---|---|---|
శ్రీకాకుళం | 6 | 4 | 0 |
విజయనగరం | 6 | 3 | 0 |
విశాఖ జిల్లా | 11 | 3 | 1 |
తూ.గో జిల్లా | 12 | 5 | 2 |
ప.గో జిల్లా | 11 | 2 | 2 |
కృష్ణా జిల్లా | 9 | 5 | 2 |
గుంటూరు జిల్లా | 12 | 4 | 0 |
ప్రకాశం జిల్లా | 6 | 6 | 0 |
నెల్లూరు జిల్లా | 3 | 7 | 0 |
కడప జిల్లా | 4 | 6 | 0 |
కర్నూలు జిల్లా | 8 | 6 | 0 |
అనంతపురం జిల్లా | 11 | 3 | 0 |
చిత్తూరు జిల్లా | 8 | 6 | 0 |
మొత్తం | 108 | 60 | 7 |