రూల్ ఈజ్ రూల్. రూల్ ఫర్ ఆల్ అన్నారు. నిబంధనల్ని అతిక్రమిస్తే ఎవరికైనా శిక్ష తప్పదు. సినీ తారలూ అందుకు అతీతులు కాదు. ట్రాఫిక్ రూల్స్ విషయంలో ప్రభుత్వాలు స్ట్రిక్టుగా ఉన్నాయి. నిబంధనల్ని అతిక్రమిస్తే ఎవ్వరినీ వదలడం లేదు. ఇప్పుడు తాప్సి కూడా అలానే బుక్కయ్యింది.
హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనం నడిపినందుకు తాప్సికి ముంబై ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. ఈ విషయాన్ని తాప్సినే స్వయంగా వెల్లడించింది. తనకు ద్విచక్రవాహనం నడపడం అంటే చాలా ఇష్టమని, అందుకే బండి రోడ్డుపైకి తీసుకొచ్చానని, అయితే హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోయానని, దాంతో ట్రాఫిక్ పోలీసులు ఇంటికి చలానా పంపించారని వివరించింది. ఇంకెప్పుడూ హెల్మెట్ పెట్టుకోవడం మర్చిపోనని, అంతా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ, హెల్మెట్ ధరించాల్సిందే అని కోరింది తాప్సి.