విభిన్న కథాంశాలతో సినిమాలు తీస్తూ తనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ ని ఏర్పాటు చేసుకున్నాడు యువ హీరో నిఖిల్. ఇటీవల వచ్చిన శంకరాభరణం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో తన దృష్టి అంతా తర్వాత తీయబోయే సినిమా మీద పెట్టాడు. ‘టైగర్’ సినిమా దర్శకుడు ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న నిఖిల్ ముందు సినిమాలో క్రేజీ బ్యూటీలు తాప్సీ, కేథరిన్ లను హీరోయిన్స్ గా తీసుకున్నారని అన్నారు. అయితే సినిమా బడ్జెట్ దృష్ట్యా వారిద్దరు ఎక్కువ డిమాండ్ చేయడంతో సినిమా నుండి వారిని తప్పించినట్టు తెలుస్తుంది.
తాప్సీ, కేథరిన్ ఇద్దరు అడిగినంత నిర్మాత ఇవ్వడం అసాధ్యమని చెప్పేసరికి వారిద్దరే సినిమా చేయమని చెప్పేసారట. అయితే వారిద్దరి స్థానంలో అవికా గోర్, హెబా పటేల్ లను తీసుకున్నారని తెలుస్తుంది. సినిమా కథ ప్రకారం సినిమాలో మరో హీరోయిన్ కూడా అవసరం ఉండగా.. ఆ మూడో భామ కోసం ఇప్పుడు దర్శక నిర్మాతలు వేట మొదలెట్టారట.
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను తయారు చేసుకుంటున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో మొదలవనున్నదట. నిఖిల్ ఈ సినిమాతో పాటుగా కార్తికేయ దర్శకుడు చందు మొండేటి ఆ సినిమాకు సీక్వెల్ గా ఓ కథని సిద్ధం చేయడం జరిగింది. అయితే ఆనంద్ సినిమా తర్వాత నిఖిల్ ఆ సినిమా చేసే అవకాశం ఉంది.