రానా కథానాయకుడిగా వేణు ఉడుగుల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. దీనికి `విరాట పర్వం` అనే పేరు పరిశీలిస్తున్నారు. సురేష్ బాబు నిర్మించే ఈ చిత్రం జులై నుంచి సెట్స్‌పైకి వెళ్లుంది. కథానాయికగా సాయిపల్లవి ఖారారైంది. అయితే ఓ కీలకమైన పాత్రలో టబు కనిపించనున్నది సమాచారం. రాజకీయ నేపథ్యంలో సాగే ఓ అందమైన ప్రేమకథా చిత్రమిది. టబు మానవ హక్కుల నేతగా కనిపించనున్నదట. ఆ పాత్రకు చాలా ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మిగిలిన భాషల్లోనూ విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే… కీలక పాత్రల కోసం పేరెన్నదగిన నటీనటుల్ని ఎంపిక చేస్తున్నారు. స్క్రిప్టు పనులు ఓ కొలిక్కి వస్తున్నాయి. మరోవైపు అల్లు అర్జున్ – త్రివిక్రమ్ చిత్రంలో ఓ పాత్రకు గానూ టబు పేరు పరిశీలిస్తున్నారు. ఈ సినిమా కూడా ఒప్పుకుంటే.. టబు చేతిలో ఏక కాలంలో రెండు తెలుగు సినిమాలుంటాయన్నమాట.