టబు.. పేరు వినగానే ఎన్నో రొమాంటిక్ చిత్రాలు గుర్తొస్తాయి. నిన్నే పెళ్లాడతా, కూలీ నెంబర్ 1 చిత్రాల్లో టబు సోయగాలు చూసి కుర్రకారుకి నిద్రరాలేదు. ఆ తరవాత బాలీవుడ్‌లోనూ అదే హవా చూపించింది. ఇప్పటికీ టబు క్రేజీ స్టారే. అయితే 45ఏళ్ళ టబుకు ఇంకా పెళ్లి కాలేదు. మరి టబు ఎప్పుడు పెళ్లి చేసుకొంటుంది? ఆ ఆలోచన ఉందా, లేదా? ఇదే విషయాన్ని తాజాగా అడిగితే .. ఓ ఫన్నీ సమాధానం చెప్పింది. హీరో అజయ్ దేవగణ్ వల్లే తనకు ఇంకా పెళ్లి కాలేదని చెప్పింది టబు.
అసలు మేటర్ ఏమిటంటే.. ‘గోల్మాల్ ఎగైన్’ లో అజయ్ దేవగణ్ తో కలసి నటించింది టబు. ఈ సినిమా ప్రమోషన్ లో టబు పెళ్లి ప్రసావన తెచ్చింది మీడియా. దీనిపై సమాధనం ఇచ్చిన టబు.. ”ఒక విధంగా చెప్పాలంటే అజయ్ వల్లే నాకు పెళ్లి కాలేదు.! అజయ్ నాకు 25 ఏళ్లుగా తెలుసు. అజయ్ మా కజిన్ సమీర్ ఇంటి పక్కనే ఉండేవాడు. మేమంతా మంచి ఫ్రెండ్స్. నేనెక్కడికి వెళ్లినా ఫాలో అయ్యేవారు. వేరే అబ్బాయిలు నన్ను చూసినా నాతో మాట్లాడినా కొడతామని బెదిరించేవారు. సమీర్.. అజయ్‌లు నన్ను ఎప్పుడూ ఓ కంట కనిపెడుతుండేవారు. నాకు ఫ్రీ డమ్ వుండేది కాదు. అది అజయ్ సమీర్ లకు బాగా తెలుసు. ఇప్పటికీ ఓ మంచి అబ్బాయిని చూడాలని అజయ్‌కి చెబుతుంటా’ అని నవ్వేసింది టబు.
టబు చెప్పిన ఫ్లాష్ బ్యాక్ ఇంట్రస్టింగానే వుంది కానీ పెళ్లి ప్రస్తావన తెచ్చిన ప్రతీ సారి ఇలాంటి సమాధానాలతోనే తప్పించుకుటుందీ టబు, మరి ఆమె పెళ్లి కబురు ఎప్పుడు చెబుతుందో..