అనుష్క త్వరలోనే భాగ్మతిగా దర్శనమివ్వబోతోంది. పిల్లజమిందార్ సినిమాతో మెప్పించిన జి.అశోక్ ఈ చిత్రానికి దర్శకుడు. దాదాపు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమాలో ఇప్పుడు ఓ ప్రత్యేక ఆకర్షణ చేరింది. అనుష్కతో పాటుగా టబు కూడా ఇందులో నటించబోతోందట. భాగ్మతిలో ఓ కీలకమైన పాత్రకోసం చిత్రబృందం టబుని సంప్రదించడం, ఆమె ఒప్పుకోవడం జరిగిపోయాయని టాలీవుడ్ సమాచారం. చంద్రసిద్దార్థ్ దర్శకత్వం వహించిన ఇదీ సంగతి తరవాత టబు తెలుగు తెరపై కనిపించలేదు. పాండురంగడులో అందాలు ఆరబోసిన టబు… ఇప్పుడు తెలుగు తెరపై మళ్లీ కనిపించబోతోందన్నమాట.
ఈ సినిమా కోసం టబు భారీ పారితోషికం ఆఫర్ చేసిందని తెలుస్తోంది. కాల్షీట్లు ఎక్కువ కావల్సిరావడంతో చిత్రబృందం కూడా టబు అడిగినంత ఇవ్వడానికి రెడీ అయ్యిందట. నదియాలాంటి వాళ్లు కీలక పాత్రలు చేస్తూ.. బిజీ బిజీగా గడిపేస్తున్నారు. ఇప్పుడు టబు కూడా ఇలాంటి పాత్రలు చేయడంలోని ఆవస్యకతని గమనించినట్టుంది. అందుకే భాగ్మతి ఒప్పుకొంది. ఈ సినిమాలో టబు రాక.. ఆమె కెరీర్‌కీ, సినిమాకీ ఎంత హెల్ప్ అవుతుందో తెలియాలంటే ఇంకొన్ని నెలలైనా ఆగాల్సిందే.